మద్యం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పై విచారణ వాయిదా పడింది.ఈ మేరకు పిటిషన్ పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు విచారణను వచ్చే నెల 21కి వాయిదా వేసింది.
ఇందులో భాగంగా స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో మధ్యంతర బెయిల్ పూర్తయ్యే వరకూ ఇతర కేసుల్లో చంద్రబాబుపై చర్యలు తీసుకోబోమని ఏజీ శ్రీరామ్ తెలిపారు.అదేవిధంగా మద్యం కేసులో నవంబర్ 15వ తేదీన కౌంటర్ దాఖలు చేస్తామని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలోతదుపరి విచారణను హైకోర్టు నవంబర్ 21వ తేదీకి వాయిదా వేసింది.అయితే మద్యం కేసులో చంద్రబాబు అక్రమంగా అనుమతులు ఇచ్చారన్న ఆరోపణలో సీఐడీ అధికారులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
ఈ కేసులో చంద్రబాబును అధికారులు ఏ3గా పేర్కొన్నారు.