వీడియో: ప్రకృతి అందాలను చూస్తూ ఈ చిన్నారి ఏమన్నదో తెలిస్తే.. ఫిదా అవుతారు...

ప్రకృతిలో కాసేపు సేదతీరితే చాలు మానసిక బాధలన్నీ మర్చిపోతాం.పక్షుల కిలకిలరావాలు, సెలయేర్ల శబ్దాలు, పచ్చని చెట్ల నడుమ సమయం గడుపుతుంటే ఎంతో ఆనందంగా, ఆహ్లాదంగా ఉంటుంది.

 See How Baby Girl Enjoying The Nature Video Viral Details, Viral News, Latest Ne-TeluguStop.com

అయితే ఈ రోజుల్లో ఇలాంటి అనుభూతిని పొందడం చాలా మంది మర్చిపోయారు.ఉరుకుల పరుగుల ప్రపంచంలో పడి ప్రకృతిని( Nature ) ఎంజాయ్ చేసే వారు కరువయ్యారు.

ప్రకృతి అందాలు కనిపించినా వాటిని పూర్తి స్థాయిలో ఆస్వాదించలేని పరిస్థితుల్లో మనుషులు ఉండిపోయారు.ఇలాంటి సమయంలో ఒక చిన్నారి ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ కెమెరాకి చిక్కింది.

బాలికను( Girl ) తల్లిదండ్రులు అడవిలోకి( Forest ) తీసుకెళ్లారు.అక్కడ భారీగా పెరిగిన చెట్లు, ఇంకా ఎన్నో ప్రకృతి సౌందర్యాలు కనిపించాయి.వాటిని చూస్తూ ఈ చిన్నారి మైమరిచిపోయింది ఓ మై గాడ్, ఓ మై గోష్, థిస్ ఇస్ సో బ్యూటిఫుల్ అంటూ ఆ పాప కామెంట్స్ చేస్తూ ఎంజాయ్ చేసింది.నేచర్ ని ఈ చిన్నారి ఎంజాయ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియోను గుడ్ న్యూస్ మూమెంట్ అనే ఇంస్టాగ్రామ్ పేజీ షేర్ చేసింది.

“బయట అడుగుపెట్టి అద్భుతమైన ప్రకృతిని ఎంజాయ్ చేయాలని ఈ చిన్నారి గుర్తు చేస్తుంది” అని దీనికి ఒక క్యాప్షన్ జోడించింది.షేర్ చేసిన సమయం నుంచి ఈ వీడియోకి ఇప్పటికే 50 వేలకు పైగా లైకులు, లక్షల్లో వ్యూస్ వచ్చాయి.ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అయిపోయారు.

ఫారెస్ట్ లోకి వెళ్తే మేం కూడా ఇలానే రియాక్ట్ అవుతామని కొందరు పేర్కొన్నారు.ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube