వీడియో: ప్రకృతి అందాలను చూస్తూ ఈ చిన్నారి ఏమన్నదో తెలిస్తే.. ఫిదా అవుతారు…

ప్రకృతిలో కాసేపు సేదతీరితే చాలు మానసిక బాధలన్నీ మర్చిపోతాం.పక్షుల కిలకిలరావాలు, సెలయేర్ల శబ్దాలు, పచ్చని చెట్ల నడుమ సమయం గడుపుతుంటే ఎంతో ఆనందంగా, ఆహ్లాదంగా ఉంటుంది.

అయితే ఈ రోజుల్లో ఇలాంటి అనుభూతిని పొందడం చాలా మంది మర్చిపోయారు.ఉరుకుల పరుగుల ప్రపంచంలో పడి ప్రకృతిని( Nature ) ఎంజాయ్ చేసే వారు కరువయ్యారు.

ప్రకృతి అందాలు కనిపించినా వాటిని పూర్తి స్థాయిలో ఆస్వాదించలేని పరిస్థితుల్లో మనుషులు ఉండిపోయారు.

ఇలాంటి సమయంలో ఒక చిన్నారి ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ కెమెరాకి చిక్కింది. """/" / ఈ బాలికను( Girl ) తల్లిదండ్రులు అడవిలోకి( Forest ) తీసుకెళ్లారు.

అక్కడ భారీగా పెరిగిన చెట్లు, ఇంకా ఎన్నో ప్రకృతి సౌందర్యాలు కనిపించాయి.వాటిని చూస్తూ ఈ చిన్నారి మైమరిచిపోయింది ఓ మై గాడ్, ఓ మై గోష్, థిస్ ఇస్ సో బ్యూటిఫుల్ అంటూ ఆ పాప కామెంట్స్ చేస్తూ ఎంజాయ్ చేసింది.

నేచర్ ని ఈ చిన్నారి ఎంజాయ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియోను గుడ్ న్యూస్ మూమెంట్ అనే ఇంస్టాగ్రామ్ పేజీ షేర్ చేసింది.

"""/" / "బయట అడుగుపెట్టి అద్భుతమైన ప్రకృతిని ఎంజాయ్ చేయాలని ఈ చిన్నారి గుర్తు చేస్తుంది" అని దీనికి ఒక క్యాప్షన్ జోడించింది.

షేర్ చేసిన సమయం నుంచి ఈ వీడియోకి ఇప్పటికే 50 వేలకు పైగా లైకులు, లక్షల్లో వ్యూస్ వచ్చాయి.

ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అయిపోయారు.ఫారెస్ట్ లోకి వెళ్తే మేం కూడా ఇలానే రియాక్ట్ అవుతామని కొందరు పేర్కొన్నారు.

ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి19, ఆదివారం 2025