శ్రీకాకుళంలో బాబు హ్యాండ్ ఇవ్వనున్న సిట్టింగులు వీళ్ళే

చంద్రబాబు అప్పుడే సిట్టింగుల సీట్లకి ఎసరు పెడుతున్నారు.వచ్చే ఎన్నికల్లో ఎవరికీ టికెట్స్ ఇవ్వాలి.

 Chandrababu Will Not Give Mlas Seats Two Senior Sitting Leaders In Srikakulam-TeluguStop.com

ఎవరికీ హ్యండ్ ఇవ్వాలి అని వ్యూహరచన ఇప్పటికే దాదాపు రెడీ అయ్యింది అని చెప్తున్నారు.చంద్రబాబు దగ్గర ఉన్న సమాచారం మేరకు ఏ నియోజకవర్గంలో ఎవరు వీక్ గా ఉన్నారు అనే రిపోర్ట్ ఆధారంగా బాబు చాలా మంది తోకలు కత్తిరించే పనిలో నిమగ్నం అయ్యారు అని తెలుస్తోంది.

చంద్రబాబు ఇప్పటి వరకు చేయించుకున్న సర్వేలో సుమారు 55 మంది మీద తీవ్రమైన వ్యతిరేకత కనబరిచారు అనే సమాచారం ఉంది.ఇప్పుడు బాబు టార్గెట్ ఈ 55 సిట్టుంగులే అని సమాచారం

అయితే వీరిలో కొంతమంది మీద ప్రజలలో వ్యతిరేకత లేకపోయినా తప్పించే ప్రయత్నం జరుగుతోందని తెలుస్తోంది.

దానికి కారణం ఏమిటి అంటే.జ‌న‌సేన‌తో పొత్తు వల్ల ఇవ్వాలిసిన సీట్లు.

త్యాగాలు.వెంటపడుతున్న వృద్ధాప్య భారం ఇలా కొంతమంది టికెట్స్ కి ఎసరు వస్తోంది…ఈ నేప‌థ్యంలో.

శ్రీకాకుళం జిల్లాలో కొంద‌రు సిట్టింగ్‌ల‌ను కూడా బాబు ప‌క్క‌న పెడుతున్న‌ట్టు తెలుస్తోంది.ఈ జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి.2014 ఎన్నిక‌ల్లో టీడీపీ సుమారు “ఏడు” నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలవగా మిగిలిన మూడు వైసీపి కి దక్కాయి.అయితే పాతపట్నం వైసీపి ఎమ్మెల్యే కలమట.

వెంకటరమణ టిడిపి లోకి జంప్ చేసి ఏడుని.ఎనిమిది చేశారు

ఇప్పుడు టిడిపికి ఉన్న ఎనిమిది మంది ఎమ్మెల్యేలలో ఇద్దరు సీనియర్స్ కి బాబు ఉద్వాసన పలకనున్నారు

కాంగ్రెస్ మాజీ మంత్రి .ప్రస్తుత వైసీపి నాయకుడు ధర్మాన మీద.గుండా లక్ష్మీ దేవి పోటీ చేసి విజయం సాధించి చరిత్ర సృష్టించారు.అయితే ఇప్పుడు.గుండ ల‌క్ష్మీదేవికి టిక్కెట్ రాద‌ని తెలుస్తోంది.ఈ సారి ఇక్క‌డ నుంచి మ‌రో వ్య‌క్తికి టిక్కెట్ ఇచ్చి గుండ ఫ్యామిలీని బాబు ప‌క్క‌న పెట్ట‌నున్నార‌ని టాక్‌.అయితే గుండా ఫ్యామిలీని సంతృప్తి పరచడానికి శ్రీకాకుళం మేయ‌ర్ సీటును గుండ అప్ప‌ల సూర్య‌నారాయ‌ణ‌కు ఇవ్వాలని బాబు అనుకుంటున్నారని టాక్

ఇదిలా ఉంటే మరో సీనియర్ ఎమ్మెల్యే అయిన పలాస గౌతు శ్యాం సుందర్ శివాజీకి టికెట్ వచ్చే అవకాశం కనిపించడం లేదు అని తెలుస్తోంది.

ఈ సారి శివాజీ కుమార్తెకి పలాస నుంచీ టికెట్ ఇచ్చే అవకాశం ఉనట్టుగా తెలుస్తోంది.ఇదిలా ఉంటే ధర్మాన ప్రసాదరావు మీద పోటీ చేసి డీ కొట్టగల అభ్యర్ధి ఎవరు ఉన్నారా అని బాబు ఆలోచిస్తున్నారు అని తెలుస్తోంది.

ఈ విషయంలో మాత్రం బాబు ఇంకా క్లారిటీకి రాలేదని.అయితే కొన్ని పేర్లు పరిశిలనలో ఉన్న సరే ఇప్పుడే బయటకి పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారని తెలుస్తోంది.

ఒక్క శ్రీకాకుళం జిల్లాకే చంద్రబాబు ఇన్ని ఆలోచనలు చేస్తే మరి మిగతా జిల్లాల సిట్టింగుల పరిస్థితి ఏమిటో అని తెగ టెన్షన్ పడుతున్నారు టిడిపి నాయకులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube