అమెరికా- కెనడా మధ్య రవాణా సేవలు అందించే ట్రక్కర్లు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలన్న ప్రభుత్వ నిర్ణయం అక్కడ ఉద్రిక్తతలకు దారి తీసిన సంగతి తెలిసిందే.కొద్దిరోజుల పాటు సాగిన ఈ ఆందోళన నుంచి రాజధాని ఒట్టావాను పోలీసులు తమ స్వాధీనంలోకి తీసుకున్నారు.
దాదాపు నెల రోజుల తర్వాత నగరం ఆదివారం ప్రశాంతంగా కనిపించింది.రెండు రోజుల పాటు ట్రక్కర్లను ఎదుర్కొన్న పోలీసులు వారిని పార్లమెంట్ హిల్ వెలుపల నుంచి తరిమికొట్టారు.చాలాకాలం పాటు చికాకు పెట్టిన ట్రక్కర్ల నిరసన, రణగొణ ధ్వనులు తప్పిపోవడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.ఒట్టావా తాత్కాలిక పోలీస్ చీఫ్ స్టీవ్ బెల్ ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ.
చాలామంది నిరసనకారులు నగరాన్ని విడిచి వెళ్లిపోయారని తెలిపారు.కానీ ఆపరేషన్ ఇంకా ముగియలేదని.
వీధులను ఆందోళనకారులు మళ్లీ ఆక్రమించుకోవడానికి వీల్లేకుండా చూస్తున్నామని స్టీవ్ బెల్ వెల్లడించారు.
ట్రక్కర్ల ఆందోళన నేపథ్యంలో ప్రధాని జస్టిన్ ట్రూడో దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించిన సంగతి తెలిసిందే.అయితే పరిస్ధితుల నేపథ్యంలో పోలీసులు అత్యవసర అధికారాలను మరికొంతకాలం ఉపయోగించుకోవడానికి వీలుగా కెనడా చట్టసభ సభ్యులు సోమవారం ఓటు వేశారు. హౌస్ ఆఫ్ కామన్స్‌లోని చట్టసభ సభ్యులు ఈ తీర్మానానికి ఆమోదముద్ర వేశారు.
ట్రక్కర్ల ఆందోళనను పోలీసులు అడ్డుకున్నప్పటికీ.మళ్లీ ఇదే తరహా పరిస్థితులు చోటు చేసుకోకుండా పోలీసులకు ఎమర్జెన్సీ పవర్స్ వుండాలని ప్రధాని ట్రూడో గతంలోనే చెప్పారు.
రాజధాని శివార్లలో మరికొందరు ట్రక్కర్లు వున్నారని ట్రూడో గుర్తించారు.వారు మరోసారి రహదారులను దిగ్బంధించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారని కెనడా ప్రజా భద్రతా శాఖ మంత్రి చెప్పారు.ఎమర్జెన్సీ యాక్ట్ వల్ల.కొన్ని ప్రాంతాలను నో గో జోన్‌లుగా ప్రకటించడానికి పోలీసులకు వీలు కలుగుతుంది.ట్రక్కర్ల వ్యక్తిగత, కార్పోరేట్ బ్యాంక్ ఖాతాలను స్తంభించడానికి కూడా వెసులుబాటు కలిపిస్తుంది.