అన్నం కోసం వచ్చి అంతు చూసిన కిరాతకులు

పెళ్లిలో నలుగురికి మంచి భోజనం పెట్టి వారి ఆశీర్వాదం తీసుకోవాలని అందరూ చూస్తారు.అయితే పిలిచిన పెళ్లికి వెళ్లడానికే సమయం దొరకని ఈ రోజుల్లో పిలవని పేరంటానికి భోజనం కోసం వచ్చిన ఇద్దరు వ్యక్తులు కిరాతకానికి ఒడిగట్టిన ఘటన అమెరికాలోని కాలిఫోర్నియాలో చోటు చేసుకుంది.

 California Wedding Crashers Killed Groom-TeluguStop.com

జాయ్ మెల్గాజ్(30) ఘనంగా తన వివాహ వేడుకను జరుపుకున్నాడు.కాగా పెళ్లి అనంతరం గ్రాండ్ రిసెప్షన్ పార్టీ ఇచ్చాడు.ఈ రిసెప్షన్ పార్టీలో భోజనం చేసేందుకు క్యాస్టానెదా రమిరెజ్(28) అతడి సోదరుడు జోస్యూ క్యాస్టానెదా రమిరెజ్‌లు వచ్చారు.వారిని ఈ వేడుకకు జాయ్ పిలవలేదు.

అయితే వారిని గుర్తుపట్టిన జాయ్ కుటుంబ సభ్యులు, వారిని ఆ వేడుక నుండి వెళ్లగొట్టారు.ఇది అవమానంగా భావించిన ఆ ఇద్దరు సోదరులు, జాయ్ మెల్గాజ్ తన భార్యతో కలిసి ఇంటికి వెళ్లే సమయంలో గొడవకు దిగారు.

తమ వెంట తెచ్చుకున్న బ్యాట్లతో జాయ్ మరియు అతడి కుటుంబ సభ్యులపై దాడి చేశారు.ఈ దాడిలో జాయ్ తీవ్రంగా గాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందాడు.కాగా ఈ దారుణానికి ఒడిగట్టిన ఇద్దరు సోదరులను పోలీసులు అరెస్ట్ చేశారు.కాగా పెళ్లయిన కొన్ని క్షణాల్లోనే పెళ్లికొడుకు మృతిచెందడంతో ఆ వధువు కన్నీరుమున్నీరయింది.

#Groom #California #Murder

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు