అన్నం కోసం వచ్చి అంతు చూసిన కిరాతకులు
TeluguStop.com
పెళ్లిలో నలుగురికి మంచి భోజనం పెట్టి వారి ఆశీర్వాదం తీసుకోవాలని అందరూ చూస్తారు.
అయితే పిలిచిన పెళ్లికి వెళ్లడానికే సమయం దొరకని ఈ రోజుల్లో పిలవని పేరంటానికి భోజనం కోసం వచ్చిన ఇద్దరు వ్యక్తులు కిరాతకానికి ఒడిగట్టిన ఘటన అమెరికాలోని కాలిఫోర్నియాలో చోటు చేసుకుంది.
జాయ్ మెల్గాజ్(30) ఘనంగా తన వివాహ వేడుకను జరుపుకున్నాడు.కాగా పెళ్లి అనంతరం గ్రాండ్ రిసెప్షన్ పార్టీ ఇచ్చాడు.
ఈ రిసెప్షన్ పార్టీలో భోజనం చేసేందుకు క్యాస్టానెదా రమిరెజ్(28) అతడి సోదరుడు జోస్యూ క్యాస్టానెదా రమిరెజ్‌లు వచ్చారు.
వారిని ఈ వేడుకకు జాయ్ పిలవలేదు.అయితే వారిని గుర్తుపట్టిన జాయ్ కుటుంబ సభ్యులు, వారిని ఆ వేడుక నుండి వెళ్లగొట్టారు.
ఇది అవమానంగా భావించిన ఆ ఇద్దరు సోదరులు, జాయ్ మెల్గాజ్ తన భార్యతో కలిసి ఇంటికి వెళ్లే సమయంలో గొడవకు దిగారు.
""img "aligncenter" Src="" /
తమ వెంట తెచ్చుకున్న బ్యాట్లతో జాయ్ మరియు అతడి కుటుంబ సభ్యులపై దాడి చేశారు.
ఈ దాడిలో జాయ్ తీవ్రంగా గాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందాడు.కాగా ఈ దారుణానికి ఒడిగట్టిన ఇద్దరు సోదరులను పోలీసులు అరెస్ట్ చేశారు.
కాగా పెళ్లయిన కొన్ని క్షణాల్లోనే పెళ్లికొడుకు మృతిచెందడంతో ఆ వధువు కన్నీరుమున్నీరయింది.
చిరంజీవి అంటే అంత ఇష్టమంటున్న బన్నీ.. మెగా ఫ్యాన్స్ సపోర్ట్ లభిస్తుందా?