తెలంగాణలో బిజినెస్ పాలన నడుస్తోంది

నల్లగొండ జిల్లా:తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పరిపాలన పక్కదారి పట్టి,వ్యాపార పాలన నడుస్తోందని నకిరేకల్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు గుండా జలంధర్ రెడ్డి మండిపడ్డారు.

రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో టీఆర్ఎస్ పార్టీ విలువలు పోగొట్టుకుందని విమర్శించారు.

హెటిరో సంస్థకు చెందిన పార్థసారథిని రాజ్యసభకు ఎందుకు ఎంపిక చేశారనేది ప్రశ్నార్థకంగా మారిందన్నారు.గతంలో ఐటీ రైడ్స్‌లో 500 కోట్లతో దొరికిన వ్యక్తికి రాజ్యసభ సీటు ఇచ్చారని,తెలంగాణ ఉద్యమంలో ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు రాజ్యసభ సీటు ఎందుకివ్వలేదని ప్రశ్నించారు.

Business Rule Is Running In Telangana-తెలంగాణలో బిజి�

కేసీఆర్ ఢిల్లీకి వెళ్తుంటే,మోడీ హైదరాబాద్ వస్తున్నారని, అసలు ఇదేమి రాజకీయమని ఎద్దేవా చేశారు.గతంలో దివంగత సీఎం ఎన్టీఆర్ కూడా ఇందీరా గాంధీకి స్వాగతం పలికారని,కానీ,ప్రధాని మోడీ హైదరాబాద్‌కు వస్తుంటే,సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్తున్నారని,వీరి రాజకీయంపై అనుమానం కలుగుతోందని పేర్కొన్నారు.

మోడీ హైదరాబాద్ వచ్చే సమయంలో అసలు సీఎం ఢిల్లీకి ఎందుకెళ్లారని ప్రశ్నించారు.నల్గొండలో పోటీ చేసే దమ్ము అసదుద్దీన్ ఓవైసీకి ఉందా అని ప్రశ్నించారు.

Advertisement

ఓవైసీకి హైదరాబాద్‌లో కాకుండా ఇంకో పార్లమెంట్ స్థానంలో పోటీ చేసే దమ్ముందా? అని సవాల్ విసిరారు.రాష్ట్రంలో టీఆర్ఎస్,బీజేపీ,ఎంఐఎం కలసి ప్రజల్లో రాజకీయ గందరగోళం సృష్టించి,ఎన్నికల్లో పబ్బం గడుపుకునేందుకు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు.

కులం పేరుతో దూషించిన ముగ్గురికి ఆరు నెలలు జైలు శిక్ష
Advertisement

Latest Nalgonda News