బీఆర్ఎస్ నాయకులు మతి భ్రమించి మాట్లాడుతున్నారు:దేవరకొండ ఎమ్మేల్యే

నల్లగొండ జిల్లా:200 యూనిట్ల ఉచిత విద్యుత్ పై తప్పుడు ప్రచారాలు చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మతి స్థిమితం కోల్పోయి,అడ్డం పొడుగు మాట్లాడుతున్నారని, తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదని దేవరకొండ ఎమ్మెల్యే బాలూ నాయక్ హెచ్చరించారు.

శనివారం నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం రాంపురం గ్రామంలో సిసి రోడ్లకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లోనే ఆరు గ్యారెంటీల్లో నాలుగు అమలు చేసిందని,ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తుందని,ఇది ప్రజల కోసం ఏర్పడ్డ ప్రజా ప్రభుత్వమని అన్నారు.

ప్రతిపక్ష పార్టీ ప్రజలకు అందుతున్న సంక్షేమాన్ని జీర్ణించుకోలేక, సహించలేక కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేస్తుందని మండిపడ్డారు.ప్రతి కార్యకర్త కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని ఎదుర్కొని ప్రజలకు వాస్తవాలను వివరించాలని సూచించారు.

BRS Leaders Are Delusional Devarakonda MLA , Devarakonda MLA, BRS Leaders , MLA

వేసవికాలం దృష్ట్యా ఏర్పడే నీటి ఎద్దడిని అధికారులు అధిగమించాలని కోరారు.రానున్న పార్లమెంటు ఎన్నికల్లో దేవరకొండ నియోజకవర్గం నుండి అధిక మెజార్టీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జడ్పీ ఫ్లోర్ లీడర్ అలొవెల్లి శోభారాణి,మండల అధ్యక్షుడు ఎల్లయ్య యాదవ్,బొడియ నాయక్,సతీష్ రెడ్డి,మండల ప్రధాన కార్యదర్శి అడేపు సతీష్,బీసీ సెల్ మండల అధ్యక్షుడు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
కులం పేరుతో దూషించిన ముగ్గురికి ఆరు నెలలు జైలు శిక్ష

Latest Nalgonda News