అదొక బిచ్చగాళ్ల బ్యాంక్.. అక్కడ 1 శాతం వడ్డీకే రుణాలు..!

మాములుగా మనం భవిష్యత్తు ప్రయోజనాలకై ఎంతో కొంత బ్యాంకుల్లో డబ్బులు దాచుకుంటాం.రుణాలు కావాలన్నా బ్యాంక్ ను ఆశ్రయిస్తాం.

 Bihar Muzaffarpur Beggars Bank With Only One Percent Interest Loans, Beggers Ban-TeluguStop.com

అలాంటి బ్యాంకులను మనం చాలానే చూసి ఉన్నాం.వాటిల్లో కొన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, సెంట్రల్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఇలా మన దేశం లో 42కు పైగా ప్రభుత్వ , ప్రైవేట్ బ్యాంక్ లు ఉన్నాయని మనకు తెలుసు.

కానీ బిచ్చగాళ్ల బ్యాంక్ గురించి ఎప్పుడైనా విన్నారా.అక్కడ 1 శాతం వడ్డీకే రుణాలు ఇస్తారంట.

బిచ్చగాళ్ల బ్యాంక్ ఏంటి .? 1 శాతం వడ్డీకే రుణాలేంటి.? అని ఆశ్చర్యపోతున్నారా.! ఇది నిజంగా నిజమేనండి.

నమ్మక పోతే.ఈ కథ చదవండి.

బీహార్ లోని ముజఫర్ పూర్ లో కొంతమంది బిచ్చగాళ్లు కలిసి బిచ్చగాళ్ల బ్యాంక్ ను ప్రారంభించారు.బిచ్చగాళ్ల బ్యాంక్ ను స్థాపించడం ఏంటి అని ఆశ్చర్య పోకండి.

నగరంలోని 175 మంది యాచకులు తమ అవసరాలను తీర్చుకోవడానికి, భవిష్యత్తులో ఇబ్బందులను నివారించడానికి అయిదు స్వయం సహాయక బృందాలుగా ఏర్పడి ఈ బిచ్చగాళ్ల బ్యాంక్ ను నడుపుతున్నారని అక్కడి స్థానికులు తెలిపారు.

ప్రస్తుతం 175 మంది యాచకులు స్వయం సహాయక సంఘాలతో సంబంధాలు కలిగి ఉన్నారు.

Telugu Intrest, Beggars, Beggers Bank, Bihar, Interest Rates, Latest, Interest L

భిక్షాటన ద్వారా సంపాదించిన సొమ్మంతా వారు ఈ బ్యాంక్ లో జమ చేస్తూ వాటి పై వడ్డీ కూడా పొందుతున్నారు.ఇందులో 70 శాతం మంది మహిళా సభ్యులే ఉన్నారు.ఇక్కడి సభ్యులకు అవసరమైనప్పుడు మూడు నెలల పాటు.1 శాతం వడ్డీకే రుణాలు పొందుతారు.ఈ బ్యాంక్ కు సంబంధించి మొబైల్ యాప్ కూడా ఉంది.అందులో బిచ్చగాళ్ల సభ్యుల డాటా ఉంటుంది.ముజఫర్ జిల్లా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ మాట్లాడుతూ బిచ్చగాళ్ల చేప్పట్టిన ఈ ప్రయత్నం విజయవంత మైందన్నారు.దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా వీరికి సహాయం చేయడానికి ముందుకు వచ్చిందని తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube