దళిత జర్నలిస్టులపై దాడులు చేస్తే సహించేది లేదు:ఎంజెఎఫ్

నల్లగొండ జిల్లా:జర్నలిస్ట్ పృథ్వీరాజ్ ను బెదిరింపులకు గురి చేస్తూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరులు చేస్తున్న అసత్యపు ఆరోపణలపై సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో మునుగోడు నియోజకవర్గ మాదిగ జర్నలిస్ట్ ల ఫోరమ్ అధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు.

ఈ సందర్భంగా మాదిగ జర్నలిస్టుల ఫోరమ్ జిల్లా అధ్యక్షుడు జీడిమెట్ల రవీందర్ మాట్లాడుతూ ప్రశ్నించే గొంతుగా సమసమాజం దిన పత్రికలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిపై పలు కథనాలు ప్రచురించినందుకు జర్నలిస్ట్ పృథ్వీరాజ్ పై అసత్య ఆరోపణలు చేస్తూ,ఎమ్మెలే రాజగోపాల్ రెడ్డి అనుచరులు సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా బెదిరింపులకు పాల్పడుతూ వేధింపులకు గురిచేస్తున్నారని అన్నారు.

అసత్యపు ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అనుచరులు చేసిన అనుచిత వ్యాఖ్యలకు బాధ్యత వహించి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.భవిష్యత్ లో మరోసారి ఇలాంటి సంఘటనలు ఎదురైతే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

Attacks On Dalit Journalists Will Not Be Tolerated: MJF-దళిత జర్�

ఈ సందర్భంగా సంస్థాన్ నారాయణపురం జర్నలిస్ట్ కలకొండ సంజీవ మాట్లాడుతూ భావ ప్రకటన స్వేచ్ఛను హరించే విధంగా వ్యక్తిగతంగా దుశ్చర్యలకు పల్పడకూడదని అన్నారు.కార్యక్రమంలో జర్నలిస్టులు ఉదరి శ్యామ్, బొదల నరేష్,ఆరుట్ల లింగస్వామి,ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకుడు బొనగిరి దేవేందర్,చండూరు ఆర్గనైజింగ్ సెక్రటరీ అడపు పరమేష్,మునుగోడు మండల కన్వీనర్ మెడి అశోక్,దండు పర్షురామ్ తదితరులు పాల్గొన్నారు.

తండ్రి రైతు.. కొడుకు ఐఏఎస్.. ఈ వ్యక్తి సక్సెస్ స్టోరీ వింటే హ్యాట్సాఫ్ అనాల్సిందే!
Advertisement

Latest Nalgonda News