"ప్రతి ఇంట్లో అన్నగారి రూపం – తెలుగు వారి ఆత్మగౌరవం.." అంటూ అన్నగారి విగ్రహాలు..!

తెలుగు రాష్ట్ర ప్రజలకు నందమూరి తారకరామారావు పేరు తెలియని వారుండరు.విశ్వవిఖ్యాత, నట సార్వభౌమ, నటరత్న, పద్మశ్రీగా బిరుదులు గడించారు.

 Annagari Form In Every House Telugu Their Self Respect Ntr Idols, Ntr Radium Sta-TeluguStop.com

తరాలు మారినా నందమూరి తారకరాముడి కీర్తి తరగనిది.సినీ పరిశ్రమలోనూ.

రాజకీయాల్లోనూ తనదైన ముద్రను వేసుకున్నారు.ఇప్పటికి తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువే.

ఎంతోమంది తమ అభిమానాన్ని పలు రకాలుగా వ్యక్తపరుస్తుంటారు.తాజాగా హైదరాబాద్ లోని కూకట్ పల్లి కి చెందిన కొండలరావు కర్నాటి (కేకేఆర్ చౌదరి) అనే వ్యక్తి తన అభిమానాన్ని చాటుకున్నాడు.

వినూత్నంగా ఆలోచించి ఎన్టీఆర్ రేడియం విగ్రహాలను తయారు చేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు.

ఎన్టీఆర్ 25వ వర్ధంతి సందర్భంగా రేడియం తోపాటు ఫైబర్ తో విగ్రహాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కేకేఆర్ చౌదరి తెలిపారు.

శ్రీ మోక్షజ్ఞ ఎంటర్ ప్రైజెస్ అనే సంస్థ ద్వారా ఈ విగ్రహాలను కూడా అమ్ముతున్నారు.ఈ సందర్భంగా కేకేఆర్ చౌదరి మాట్లాడుతూ.‘‘ప్రతి ఇంట్లో అన్న గారి రూపం – తెలుగు వారి ఆత్మ గౌరవం’ అనే నినాదంతో ఎన్టీఆర్ విగ్రహానికి అందుబాటులోకి తెచ్చామన్నారు.ఎన్టీఆర్ విగ్రహం ప్రతిఒక్కరి ఇంట్లో, ఆఫీస్ లో, కారులో పెట్టుకునేలా వివిధ సైజుల్లో అందుబాటులోకి తెచ్చారు.రేడియంతో ప్రత్యేకంగా తయారు చేసిన విగ్రహానికి ధర రూ.1000 నుంచి రూ.2000 వరకు ఉంచడం జరిగిందన్నారు.

Telugu Serior Ntr, Latest-Latest News - Telugu

తెలుగు రాష్ట్ర ప్రజలు ‘అన్నగారు’ అని ఎంతో అభిమానంగా పిలుచుకునే నందమూరి తారక రామారావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని కృష్ణా జిల్లా నిమ్మకూరులో మే 28, 1923లో జన్మించారు.తెలుగు, తమిళం, హిందీ భాషలలో కలిపి దాదాపు 400 వరకు సినిమాలు చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube