బోయపాటి శ్రీను పై కౌంటర్లు వేసిన అనిల్ రావిపూడి..గొడవ ముదిరిపోయిందిగా!

సౌత్ ఇండియా మొత్తం మీద ఇప్పుడు టాప్ 2 మ్యూజిక్ కంపోజర్స్ ఎవరు అంటే, ఎవరైనా కళ్ళు మూసుకొని చెప్పే పేర్లు అనిరుద్ ( Anirudh )మరియు థమన్( Thaman ).చిన్న సినిమాల దగ్గర నుండి పెద్ద సినిమాల వరకు వీళ్ళే మ్యూజిక్ ని కంపోజ్ చేస్తున్నారు.

 Anil Ravipudi Countered Boyapati Srinu , Anirudh, Boyapati Srinu , Anil Ravipudi-TeluguStop.com

ఇద్దరి మీద సోషల్ మీడియా లో ఎంత పాజిటివిటీ ఉందో అంతే నెగటివిటీ కూడా ఉంది.కానీ థమన్ కి ఉన్న నెగటివిటీ తో పోలిస్తే అనిరుద్ కి చాలా తక్కువ అనే చెప్పాలి.

పాపం థమన్ కి సంబంధించి ఏ పాట విడుదలైన పలానా సినిమా నుండి కాపీ కొట్టాడు అని వీడియో తో సహా అప్లోడ్ చేస్తుంటారు నెటిజెన్స్.కానీ సాంగ్స్ పరంగా ఆయన మీద ఎంత నెగటివిటీ వచ్చినా, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విషయం లో మాత్రం తనకి తానే సాటి ఎవ్వరూ లేరు పోటీ అనే రేంజ్ లో ఇస్తాడు.

Telugu Akhanda, Anil Ravipudi, Anirudh, Bhagwant Kesari, Boyapati Srinu, Thaman,

సినిమాల్లో యావరేజి గా ఉన్న సన్నివేశాలు కూడా థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వల్ల అద్భుతంగా అనిపిస్తాయి.చాలా సినిమాలను అలా తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ద్వారా సూపర్ హిట్ నుండి బ్లాక్ బస్టర్ రేంజ్ కి తీసుకెళ్లాడు.అయితే రీసెంట్ గా విడుదలైన స్కంద చిత్రం మాత్రం థమన్ కి చాలా చెడ్డ పేరుని తీసుకొచ్చింది.ఇతను ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వల్లే ఆ చిత్రం ఫ్లాప్ అయ్యిందని నెటిజెన్స్ కామెంట్స్ చేశారు.

రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో బోయపాటి శ్రీను ( Boyapati Srinu )కూడా థమన్ పై నెట్టేశాడు. ‘అఖండ’( akhanda ) చిత్రం రీ రికార్డింగ్ లేకపోయినా మీకు అదే రేంజ్ ఫీలింగ్ వస్తాడని, ఆ సినిమాలో ఉన్న పవర్ అలాంటిది అంటూ బోయపాటి శ్రీను థమన్ ని తగ్గిస్తూ చేసిన కామెంట్స్ పెద్ద వివాదానికి దారి తీసింది.

Telugu Akhanda, Anil Ravipudi, Anirudh, Bhagwant Kesari, Boyapati Srinu, Thaman,

ఇకపోతే థమన్ మ్యూజిక్ అందించిన ‘భగవంత్ కేసరి’( Bhagwant Kesari ) చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 20 వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ సినిమాకి సంబంధించిన ప్రొమోషన్స్ లో మూవీ టీం మొత్తం ఫుల్ బిజీ గా ఉంది.అందులో భాగంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇచ్చిన రీసెంట్ ఇంటర్వ్యూ లో థమన్ గురించి మాట్లాడుతూ, ఈ సినిమాకి థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రాణం పోసింది.చాలా సన్నివేశాలు ఆయన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కారణంగా మేము అనుకున్న దానికంటే అద్భుతంగా వచ్చినట్టు అనిపించింది.

రేపు సినిమా చూసిన తర్వాత మీరు కూడా ఇదే చెప్తారు.బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరియు సాంగ్స్ డైరెక్టర్ టేస్ట్ ని బట్టీ ఔట్పుట్ ఉంటుంది.నాకు తెలిసి థమన్ ఇప్పటి వరకు తన బెస్ట్ ఇస్తూ వచ్చాడు అంటూ బోయపాటి శ్రీను కామెంట్స్ కి పరోక్షంగా కౌంటర్లు వేసాడు అనిల్ రావిపూడి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube