పదేళ్ల క్రితం శంకుస్థాపన చేసిన అంగన్వాడి కేంద్రం

సూర్యాపేట జిల్లా: ఆత్మకూర్ (ఎస్) మండలం ఏనుబాముల గ్రామంలో అంగన్వాడి భవనానికి 2014 లో అప్పటి జడ్పిటిసి పెరుమాళ్ళ సంపత్ రాణి శంకుస్థాపన చేసి స్లాబ్ నిర్మాణం చేశారు.2024 వరకు ఎవరూ పట్టించుకోలేదు.

2024 జనవరిలో మళ్లీ నిర్మాణం ప్రారంభించి చుట్టూ గోడలు నిర్మించి,గదులకు కిటికీలు బిగించారు.

గదులలో ఫ్లోరింగ్,కలర్స్, వాష్ రూమ్ లాంటి పనులు మిగిలి ఉన్నాయి.ఈ రెండవసారి పనులు ప్రారంభించి కూడా ఏడు నెలలవుతున్నా ఇంత వరకు ప్రారంభించే అవకాశం మాత్రం కనిపించడం లేదు.

Anganwadi Center Which Had Its Foundation Stone Laid Ten Years Ago, Srivanini, C

దీనితో పాత భవనంలో చిన్నపిల్లలు ఇబ్బందులు పడుతున్నారు.ఒకే గదిలో కిచెన్,స్టోర్ రూమ్,తరగతి గది ఉండడంతో చిన్నపిల్లలు మధ్యాహ్నం భోజనానికి వచ్చే బాలింతలు,గర్భిణిలు కూర్చునే స్థలం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

కనీసం బాత్రూం కూడా లేకపోవడంతో పిల్లలతో పాటు టీచర్ కూడా ఇబ్బంది పడుతున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి నూతన భవనంలో మిగిలిపోయిన కొద్దిపాటి పనులను పూర్తి చేసి వెంటనే భవనాన్ని ప్రారంభించాలని పిల్లల తల్లిదండ్రులు,గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisement

ఇదే విషయమై చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీవాణిని చరవాణిలో సంప్రదించే ప్రయత్నం చేయగా వారు అందుబాటులోకి రాలేదు.

పెద్దగట్టును దర్శించుకున్న మంత్రి ఉత్తమ్
Advertisement

Latest Suryapet News