నవంబర్ 24న మరో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఓటిటి ప్లాట్ ఫామ్ ద్వారా ప్రేక్షకులను అలరించబోతోంది.పిజ్జా, స్వామి రారా లాంటి థ్రిల్లర్స్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైన పూజ రామచంద్రన్ మరోసారి ఓ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం అంధకారం.
ఈ సినిమాకు వి.విజ్ఞరాజన్ దర్శకత్వం వహించారు.తాజాగా ఈ సినిమా టీజర్ ను ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా విడుదల చేసి ఆ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు.తెలుగులో ఈ చిత్రం టీజర్ ను థమన్ రిలీజ్ చేయగా తమిళ్ వర్షన్ ను ప్రముఖ తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ విడుదల చేశారు.
ఈ సినిమాలో రామచంద్రన్ తో పాటు కుమార్ నటరాజన్, మీనా ఘోషల్, వినోద్ కిషన్, అర్జున్ దాస్ లాంటి వారు లీడ్ రోల్స్ పోషిస్తున్నారు.ఇక ఈ టీజర్ మొత్తం సస్పెన్స్ థ్రిల్లర్ గా తీర్చిదిద్దారు.
ఈ సినిమా టీజర్ మొత్తాన్ని థ్రిల్లింగ్ సౌండ్ ఎఫెక్ట్స్ తో అలాగే అబ్బురపరిచే విజువల్స్ తో డిజైన్ చేసి ఆడియన్స్ చూడ్డానికి వదిలేశారు.ఈ టీజర్ చూస్తున్నంత సేపు ఉత్కంఠత కలుగుతుంది అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.
ఈ సినిమాకి సంబంధించిన మరికొన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని చిత్రబృందం తెలిపారు.
ఇక ఈ సినిమాకి ఓ 2 పిక్చర్స్, ఫ్యాషన్ స్టూడియోస్ సమర్పణలో కె.పూర్ణచంద్ర, సుదాన్ సుందరమ్, ప్రియా అట్లీ లు ఈ సినిమాను నిర్మించారు.ఇక ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది.
ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ను త్వరలో ఓటిటి ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ ద్వారా ముందుకు తీసుకురాబోతున్నారు.నవంబర్ 24 న ఈ సినిమా లైవ్ స్ట్రీమింగ్ కానుందని చిత్ర బృందం తెలిపింది.