Anasuya : ట్రెడిషనల్ లుక్ లో మెస్మరైజ్ చేస్తున్న రంగమ్మత్త..  అలాగే ఉంటానంటూ పోస్ట్?

బుల్లితెర యాంకర్ గా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి అనసూయ ( Anasuya )ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు దూరమైన సంగతి మనకు తెలిసిందే.ఒకప్పుడు న్యూస్ రీడర్ గా పనిచేస్తూ ఉన్నటువంటి ఈమె అనంతరం బుల్లితెరపై ప్రసారమయ్యే కార్యక్రమాలకు యాంకర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

 Anasuya Latest Poses In Treditional Outfit Pics Are So Beautiful-TeluguStop.com

అయితే జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించే సమయంలోనే ఈమెకు ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

Telugu Anasuya, Anasuyalatest, Tollywood-Movie

ఇలా జబర్దస్త్ కార్యక్రమం( Jabardast programme ) ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి అనసూయకు క్రమక్రమంగా సినిమా అవకాశాలు రావడం మొదలయ్యాయి.ఇలా వరుస సినిమా అవకాశాలు వస్తున్నటువంటి తరుణంలో ఈమె సినిమా షూటింగులకు మరోవైపు జబర్దస్త్ కార్యక్రమానికి డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఎంతో ఇబ్బంది పడుతూ తాను ఈ కార్యక్రమాన్ని వదిలేసాను అంటూ ఇటీవల ఇంటర్వ్యూ సందర్భంగా అనసూయ వెల్లడించారు.ఈ విధంగా జబర్దస్త్ కార్యక్రమానికి దూరంగా ఉన్నటువంటి ఈమె సినిమాల పరంగా వెండితెరపై మాత్రం పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేస్తున్నారు.

ఇక ఇటీవల రజాకర్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో సక్సెస్ తన ఖాతాలో వేసుకున్నారు.ఇక త్వరలోనే పుష్ప 2 సినిమా ( Pushpa 2 movie )ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి అనసూయ సిద్ధంగా ఉన్నారు.

Telugu Anasuya, Anasuyalatest, Tollywood-Movie

ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే ఈమె సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తరచూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు అయితే తాజాగా ఈమె గ్రీన్ కలర్ చుడీదార్ ( Green color chudidar )లో చాలా ట్రెడిషనల్ లుక్ లో కనిపించారు.ఇలా ఈ డ్రెస్ లో క్యూట్ ఫోటోలకు ఫోజులిస్తూ దిగినటువంటి ఫోటోలను ఈమె సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇవి కాస్త వైరల్ అవుతున్నాయి.ఇలా ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నటువంటి అనసూయ నేను ఎప్పటికీ స్వతంత్ర భావాలు కలిగినటువంటి మహిళగానే ఉంటాను అంటూ ఈమె చేసినటువంటి కామెంట్లో వైరల్ అవుతున్నాయి.ఇక ఈ ఫోటోలపై నేటిజన్స్ యధావిధిగా కామెంట్లు చేస్తున్నారు.

ఇక ఇటీవల కాలంలో ఈమె పెద్ద ఎత్తున షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమాలలో కూడా పాల్గొంటున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube