అయ్యో పాపం, అమెరికన్ మహిళను అడవిలోకి తీసుకెళ్లి చైన్‌తో కట్టేశారు!

భారతదేశంలో ఫారినర్లపై జరుగుతున్న నేరాలు పెరుగుతున్నాయి.రేప్‌లు, హత్యలతో పాటు మరింత దారుణమైన నేరాలకు పాల్పడుతున్నారు.

 American Woman Found Chained To Tree In Sindhudurg Forest Details, American Woma-TeluguStop.com

ఇలాంటి మరొక ఘోరం తాజాగా వెలుగులోకి వచ్చింది.

మహారాష్ట్ర రాష్ట్రం,( Maharashtra ) సింధుదుర్గ్ జిల్లా, సోనూర్లి అడవిలో( Sonurli Forest ) ఒక అమెరికన్ మహిళను( American Woman ) ఒక ఇనుప గొలుసుతో చెట్టుకు కట్టివేశారు.

చాలా రోజులుగా ఆమెను అలాగే కట్టేసి ఉంచారు.ఆ మహిళ సహాయం చేయాలంటూ అరుస్తూ ఎన్నో రోజులు ఆ అడవిలోనే ఆర్తనాదాలు పెట్టింది.చివరికి కొంతమంది పశువుల కాపరులు ఆమెను గుర్తించారు.ఆహారం లేక బాగా చిక్కిపోయింది.

భారీ వర్షాల కారణంగా ఆమె శరీరం తీవ్రంగా దెబ్బతిన్నది.ఆ స్థితిలో ఆమెను చూసి పశువుల కాపరులు కంటతడి పెట్టుకున్నారు.

వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

స్థానిక ప్రజల సహాయంతో పోలీసులు ఆ మహిళను ఒరోస్‌లోని ఒక ఆసుపత్రికి తరలించారు, తర్వాత మరింత చికిత్స కోసం గోవాకు( Goa ) తీసుకెళ్లారు.ఆ మహిళ అమెరికాలో జన్మించిందింది.తమిళనాడులో నివసిస్తోంది.

లలిత కాయి కుమార్ ఎస్( Lalita Kayi Kumar S ) అని పేరు పెట్టుకుంది.భారీ వర్షంలో తడవడం వల్ల, ఆహారం లేక చిక్కి పోవడం వల్ల ఆమె ప్రస్తుతం మాట్లాడలేని స్థితిలో ఉంది.

కొద్దిరోజులు పాటు మెరుగైన వైద్య చికిత్స ఆహారం అందిస్తే ఆమె మాట్లాడే స్థితికి చేరుకోవచ్చు.అప్పుడు అడవిలోకి ఆమెను ఎవరు తీసుకెళ్లారు, ఎందుకు చెట్టుకి కట్టేశారు? అసలు ఆమెపై ఎవరు ఎందుకు ఇంత పగ పట్టారు? అనే ప్రశ్నలన్నింటికీ సమాధానాలు లభిస్తాయి.

పోలీసులు ఆమె భర్తే ఈ దారుణానికి ఒడి గట్టి ఉంటాడని అనుమానిస్తున్నారు.ఆమె భర్త కూడా తమిళనాడు వాడే.అతన్ని పట్టుకోవడానికి పోలీసు బృందాలు వెళ్ళాయి.ఈ కేసులో ఇంకా దర్యాప్తు జరుగుతోంది.ఏది ఏమైనా ఈ ఘటన భారతదేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.మనుషులు ఇంత క్రూరంగా ఉంటారా అని చాలామంది దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube