అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2023( Amazon Great Indian Festival Sale ) ఇప్పుడు ప్రైమ్ మెంబర్‌లతో పాటు అందరికీ ఓపెన్ అయ్యింది.ఈ సేల్ స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, ట్యాబ్లెట్‌లు, ఇయర్‌ఫోన్‌లతో సహా వివిధ రకాల గాడ్జెట్‌లపై గొప్ప డీల్‌లను అందిస్తోంది.
సేల్ ధరలతో పాటు, అమెజాన్ లిమిటెడ్-టైమ్ ఆఫర్‌లను, ఎస్‌బీఐ కార్డ్ హోల్డర్‌లకు ఎక్స్‌ట్రా డిస్కౌంట్స్ కూడా అందిస్తోంది.ఎంపిక చేసిన వస్తువులపై 89% వరకు ఆదా చేయవచ్చు.
ఇక శామ్‌సంగ్, వన్‌ప్లస్, మరిన్ని స్మార్ట్‌ఫోన్లపై కూడా భారీ డిస్కౌంట్స్ కూడా అందిస్తోంది.అవేవో చూద్దాం.
• వన్‌ప్లస్ 11
ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 11ని ( OnePlus 11 5G )అమెజాన్ సేల్ సమయంలో రూ.48,749కే కొనుగోలు చేయవచ్చు.ఈ ధర 8GB RAM + 128GB స్టోరేజ్‌తో కూడిన బేస్ మోడల్ కోసం.6GB RAM + 256GB వేరియంట్ కూడా తక్కువ ధరకే రూ.54,749కి అందుబాటులో ఉంది.బ్యాంక్ ఆఫర్లు, కూపన్‌లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లతో వీటిని పైన పేర్కొన్న తక్కువ ధరలకే సొంతం తీసుకోవచ్చు.ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌తో రూ.3,250 వరకు, కూపన్‌లతో అదనంగా రూ.4,000 వరకు ఆదా చేసుకోవచ్చు.
• శామ్‌సంగ్ S23
శామ్‌సంగ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ శామ్‌సంగ్ గెలాక్సీ S23 8GB RAM + 128GB వేరియంట్ ను అమెజాన్ సేల్ సమయంలో రూ.59,499కి కొనుగోలు చేయవచ్చు.8GB RAM + 256GB స్టోరేజ్‌తో ఉన్న హై-ఎండ్ వేరియంట్ రూ.64,499కే అందుబాటులో ఉంది.వీటిపై ఆఫర్లలో రూ.5,000 కూపన్ డిస్కౌంట్, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌తో రూ.10,500 సేవింగ్స్ ఉంటాయి.
•
రియల్‌మీ నార్జో 60 ప్రో
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2023 సందర్భంగా, రియల్‌మీ నార్జో 60 ప్రో 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.19,999, 12GB RAM + 1TB స్టోరేజ్ వేరియంట్ రూ.24,499కే లభిస్తున్నాయి.
• శామ్‌సంగ్ గెలాక్సీ A34
సేల్ సమయంలోని ఆఫర్లతో శామ్‌సంగ్ గెలాక్సీ A34 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.24,749, 256GB స్టోరేజ్ వేరియంట్ రూ.26,749కి అందుబాటులో ఉన్నాయి.
• శామ్‌సంగ్ గెలాక్సీ M14 5G
శామ్‌సంగ్ గెలాక్సీ M14 5G( Samsung Galaxy M14 5G ) అమెజాన్ సేల్ సమయంలో 4GB RAM వేరియంట్ ధర రూ.10,240, 6GB RAM వేరియంట్ ధర రూ.11,240గా ఉంది.
• వన్‌ప్లస్ నార్డ్ CE 3
వన్‌ప్లస్ నార్డ్ CE 3 ( OnePlus Nord CE 3 5G )అమెజాన్ సేల్ సమయంలో 8GB RAM వేరియంట్‌ను రూ.22,748, 12GB RAM వేరియంట్ రూ.24,748కే సొంతం చేసుకోవచ్చు.
• వన్‌ప్లస్ నార్డ్ 3
వన్‌ప్లస్ నార్డ్ 3 8GB RAM వేరియంట్ రూ.28,749, 16GB RAM వేరియంట్ రూ.31,748 తగ్గింపు ధరల్లో అందుబాటులో ఉన్నాయి.