ముఖంపై టాటూ వేయించుకున్న బన్నీ అభిమాని.. అభిమానం ఆపలేమంటూ?

కొంతమంది అభిమానులు ఫేవరెట్ హీరోలపై అభిమాన్ని ప్రదర్శించడానికి వేర్వేరు మార్గాలను ఎంపిక చేసుకుంటూ ఉంటారు.స్టార్ హీరో అల్లు అర్జున్ కు కోట్ల సంఖ్యలో అభిమానించే అభిమానులు ఉండగా ఒక అభిమాని ముఖంపై పర్మినెంట్ టాటూ వేయించుకున్నారు.

 Hero Allu Arjun Fan Putting Permanent Tattoo On His Forehead, Allu Arjun Fan, Go-TeluguStop.com

కొంతమంది అభిమానులు అభిమానంతో పాదయాత్రలు చేస్తే బన్నీ ఫ్యాన్స్ మాత్రం అభిమానాన్ని ఈ విధంగా చాటుకోవడం గమనార్హం.

నుదుటిపై అల్లు అర్జున్ అభిమాని పర్మినెంట్ టాటూ వేయించుకున్న ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఈ ఫోటోను తెగ వైరల్ చేయడంతో పాటు ఆవేశంను సులభంగా ఆపవచ్చని ఆభిమానాన్ని మాత్రం ఆపడం సాధ్యం కాదని పేర్కొన్నారు.బన్నీ ఫ్యాన్స్ ఇలాంటి పనుల ద్వారా తమ హీరో అంటే తమకు ఎంత అభిమానమో చెప్పకనే చెప్పేస్తున్నారు.

అయితే కొంతమంది బన్నీ ఫ్యాన్స్ మాత్రం అభిమానాన్ని చూపించడం కొరకు ముఖంపై టాటూ వేసుకోవడం సరికాదని కామెంట్లు చేస్తున్నారు.

Telugu Allu Arjun Fan, Bunny Fan, Dil Raju, Fore, Fan, Tattoo, Pushpa-Movie

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు మలయాళంలో కూడా బన్నీకి భారీస్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.అక్కడ బన్నీని అభిమానులు మల్లూ అర్జున్ అని పిలుస్తారనే సంగతి తెలిసిందే.తెలుగులో రిలీజైన సమయంలోనే మలయాళంలో కూడా రిలిజై అక్కడ రికార్డులు క్రియేట్ చేశాయి.

Telugu Allu Arjun Fan, Bunny Fan, Dil Raju, Fore, Fan, Tattoo, Pushpa-Movie

ప్రస్తుతం బన్నీ పుష్ప సినిమాలో నటిస్తుండగా 2022లో ఆ సినిమా రిలీజవుతుందని వార్తలు వస్తున్నాయి.వేర్వేరు రీజన్స్ వల్ల ఈ సినిమా షూటింగ్ కు తరచూ బ్రేకులు పడుతున్నాయి.సెప్టెంబర్ నాటికి పుష్ప సినిమా షూటింగ్ పూర్తయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.ఆ తర్వాత అల్లు అర్జున్ఐకాన్ సినిమాలో నటిస్తారని దిల్ రాజు కన్ఫామ్ చేశారు.

వరుసగా దిల్ రాజు మెగా హీరోలతోనే సినిమాలను నిర్మిస్తూ ఉండటం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube