రణబీర్ కపూర్ హీరోగా అల వైకుంఠపురంలో రీమేక్

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చి సూపర్ హిట్ అయిన అల వైకుంఠపురములో సినిమా బన్నీ కెరియర్ లో అత్యధిక కలెక్షన్స్ సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది.ఫ్యామిలీ కంటెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా త్రివిక్రమ్ స్టైల్ డైలాగ్స్, బన్నీ కామెడీ టైమింగ్ వెరసి ప్రేక్షకులని భాగా ఎంగేజ్ చేసింది.

 Ala Vaikuntapuramlo Movie Remake In Bollywood, Tollywood, Trivikram Srinivas, Bu-TeluguStop.com

దీంతో ఇప్పుడు ఈ సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేసే ప్రయత్నాలు మొదలైపోయాయి.ఇప్పటికే తెలుగులో సూపర్ అయిన సినిమాలని బాలీవుడ్ దర్శక, నిర్మాతలు అక్కడికి తీసుకుపోతున్నారు.

చిన్న సినిమా అయిన సూపర్ అయితే బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి రెడీ అయిపోతున్నాడు.

ఇప్పటికే బాలీవుడ్ లో అర్జున్ రెడ్డి సినిమాని కభీర్ సింగ్ గా రిలీజ్ చేసిన సూపర్ హిట్ కొట్టిన నిర్మాత అశ్విన్ వర్దే అల వైకుంఠపురంలో రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్నాడు.

ఇక ఈ సినిమాని బాలీవుడ్ లవర్ బాయ్ రణబీర్ కపూర్ తో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు.ఇప్పటికే అతనికి సినిమా చూపించడం కూడా జరిగిందని టాక్ వినిపిస్తుంది.

త్రివిక్రమ్ సినిమాలు తెలుగులో సూపర్ హిట్ అయిన ఇప్పటి వరకు ఒకటి కూడా బాలీవుడ్ లో రీమేక్ కాలేదు.అలాంటిది మొదటి సారి అల సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు.

మరి తెలుగు ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే త్రివిక్రమ్ స్టొరీలు అక్కడి ప్రేక్షకులకి ఎలా ఎంగేజ్ చేస్తాయి అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube