7 నిమిషాలలోపు సాఫ్ట్‌వేర్ కంపెనీని నిర్మించిన చాట్‌బాట్లు.. ఇది కదా ఏఐ పవరంటే.. !

చాట్‌జీపీటీ( ChatGPT ) వంటి AI చాట్‌బాట్‌లు తక్కువ సమయంలో, చాలా తక్కువ డబ్బుతో సాఫ్ట్‌వేర్‌ను తయారు చేయగలవని బ్రౌన్ యూనివర్సిటీ( Brown University ), వివిధ చైనీస్ యూనివర్సిటీల పరిశోధకులు కనుగొన్నారు.వారి ప్రయోగంలో అత్యాధునిక భాషా మోడల్ అయిన చాట్‌జీపీటీ ఏడు నిమిషాలలోపు, ఒక డాలర్ కంటే తక్కువ ఖర్చుతో గోమోకు గేమ్ కోసం మొత్తం సాఫ్ట్‌వేర్ అభివృద్ధి ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది.

 Ai Chatbots Can Build Software Company Under 7 Minutes, Brown University, Softwa-TeluguStop.com

ఈ చాట్‌బాట్ జస్ట్ 7 మినిట్స్‌లో గోమోకు గేమ్‌ను తయారు చేయడాన్ని చూసి రీసెర్చర్లు ఆశ్చర్యపోయారు.

Telugu Brown, Chatdev, Chatgpt, Efficiency, Software-Technology Telugu

“చాట్‌డెవ్”( ChatDev )గా పిలిచే ఈ ప్రయోగంలో సీఈఓ, CTO, ప్రోగ్రామర్, ఆర్ట్ డిజైనర్ వంటి ఊహాత్మక సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కంపెనీలో నిర్దిష్ట పాత్రలతో చాట్‌జీపీటీని కేటాయించడం జరిగింది.ప్రతి AI బాట్ నిర్దిష్ట పనులు, కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్‌, ప్రమాణాలను అనుసరించింది, క్లిష్టమైన నిర్ణయాలు తీసుకోవడానికి, ప్రాజెక్ట్ అంతటా సంక్లిష్ట సవాళ్లను పరిష్కరించడానికి సజావుగా సహకరించింది.

ఇవి తయారు చేసిన సాఫ్ట్‌వేర్‌లో 87% బాగా పనిచేశాయి.

AI చాట్‌బాట్‌లు( AI Chatbot ) కోడర్‌లు, ప్రోగ్రామర్లు మరింత ప్రొడక్టివ్‌గా ఉండటానికి సహాయపడతాయి.అవి వ్యాపారాల కోసం సాఫ్ట్‌వేర్‌ను మరింత చౌకగా కూడా చేయవచ్చు.

అయినప్పటికీ, పరిశోధకులు ఏఐ చాట్‌బాట్‌లను మెరుగుపరచడానికి మార్గాలపై పని చేస్తున్నారు, తద్వారా అవి తక్కువ తప్పులు చేస్తాయి.

Telugu Brown, Chatdev, Chatgpt, Efficiency, Software-Technology Telugu

చాట్‌జీపీటీ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్( Software Development ) లో క్లిష్టమైన దశలను ఆటోమేటిక్‌గా నావిగేట్ చేయగల సామర్థ్యాన్ని ప్రదర్శించింది తగిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని ఎంచుకోవడం నుంచి బగ్స్‌ను గుర్తించడం, పరిష్కరించడం వరకు, AI చాట్‌బాట్ చెప్పుకోదగిన ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, పరిశ్రమలోని ఉత్తమ పద్ధతులకు కట్టుబడి ఉందని ప్రదర్శించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube