నాగబాబుపై కామెంట్స్‌తో శివాజీ రాజా కథ కంచికేనా?  

Actor Sivaji Raja Comments On Nagababu-bheemavaram,chiranjeevi,film Industry,nagababu,pawan Kalyan,shivaji Raja

  • మెగా బ్రదర్‌ నాగబాబు తనను మోసం చేశాడని, చివరి నిమిషంలో నరేష్‌ ప్యానల్‌కు మద్దతు ఇవ్వడం వల్ల నేను ఓడిపోయాను అంటూ శివాజీ రాజా తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశాడు. తాను ఓడిపోవడానికి ప్రధాన కారణం అయిన నాగబాబును ఖచ్చితంగా వదిలి పెట్టను, నాకు ఓటమిని గిఫ్ట్‌గా ఇచ్చిన నాగబాబుకు నేను రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తాను అంటూ ప్రకటించాడు.

  • నాగబాబుపై కామెంట్స్‌తో శివాజీ రాజా కథ కంచికేనా?-Actor Sivaji Raja Comments On Nagababu

  • అన్నట్లుగానే నాగబాబు జనసేన అభ్యర్థిగా ఎంపీగా పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆయనకు వ్యతిరేకంగా భీమవరంలో ప్రెస్‌ మీట్‌ పెట్టి మరీ తిట్టి పోశాడు.

    నాకు చిరంజీవి మరియు పవన్‌ కళ్యాణ్‌ అంటే గౌరవం ఉంది అంటూనే నాగబాబును ఏకి పారేశాడు.

  • 600 మంది ఉన్న మాకు న్యాయం చేయలేక పోయిన నాగబాబు ఇప్పుడు ఎంపీగా లక్షలాది మందికి ఏం చేస్తాడు అంటూ శివాజీ రాజా బాహాటంగానే మీడియా ముందు అన్నాడు. దాంతో మెగా వర్గాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. మెగా ఫ్యామిలీకి మద్దతు అంటూనే శివాజీ రాజా నాగబాబు గురించి ఇలా మాట్లాడటంపై చిరంజీవి తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు.

  • Actor Sivaji Raja Comments On Nagababu-Bheemavaram Chiranjeevi Film Industry Nagababu Pawan Kalyan Shivaji

    మెగా ఫ్యామిలీకి దూరం అయ్యే వారు ఎవరైనా కూడా సినిమా పరిశ్రమకు దూరం అవ్యావల్సిందే అంటున్నారు. చిన్నా చితకా సినిమాలే ఇప్పటి వరకు చేస్తూ వస్తున్న శివాజీ రాజా ఇకపై ఆ సినిమా ఛాన్స్‌లు కూడా కోల్పోయే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. శివాజీ రాజాతో వర్క్‌ చేసిన వారు ఇకపై మెగా సంబంధాలు కోల్పోవాల్సి వస్తుందనేది కొందరి వాదన.

  • అందుకే మెగా సంబంధాల కోసం శివాజీ రాజాను పక్కకు పెట్టే అవకాశం ఉందని అంటున్నారు. అదే జరిగితే శివాజీ రాజా కథ కంచికే అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.