నెంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు నడిపితే చర్యలు తప్పవు:జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్

నల్లగొండ జిల్లా:జిల్లాలో వాహనాలకు నంబర్ ప్లేట్లు(Number plates ) లేకుండా నడపవద్దని,ప్రతి రోజూ జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తూ ట్రాపిక్ నిబంధనల విరుద్ధంగా వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేయబడుతాయని జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్( District SP Sarath Chandra Pawar ) ఒక ప్రకటనలో తెలిపారు.

శుక్రవారం జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 551 వాహనాలను పట్టుబడి చేయడం జరిగిందన్నారు.

జిల్లాలో చాలా మంది వాహనదారులు తమ వాహనాలకు నంబర్ ప్లేట్స్ లేకుండా వాహనాలపై ప్రయాణిస్తున్నారని,ఇకనైనా తమ వాహనాలకు నంబర్ ప్లేట్స్ ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ఉండాలన్నారు.కొంత మంది నంబర్ ప్లేట్ లేకుండా వాహనాల నడుపుతూ అనేక నేరాలకు,దొంగతనాలకు పాల్పడుతున్నారని అన్నారు.

ప్రతి వాహనానికి నంబర్ స్పష్టంగా కనిపించే విధంగా నంబర్ ప్లేట్ ఏర్పాటు చేసుకోవాలని, లేనియెడల యు/యస్ 80 (ఎ) 177 ఎంవీ ఆక్ట్ క్రింద కేసులు నమోదు చేయబడుతాయని హెచ్చరించారు.

చందంపేట తహశీల్దార్ ఆఫీస్ ను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్
Advertisement

Latest Nalgonda News