పరిశ్రమలో పనిచేయడానికి వచ్చిన ఒక వలస మహిళ కూలీ దారుణ హత్యకు గురైన ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది.అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.
మనోహరాబాద్ ఎస్సై కరుణాకర్ రెడ్డి( SI Karunakar Reddy ) తెలిపిన వివరాల ప్రకారం.మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే కాళ్లకల్ గ్రామ శివారులో ఉండే సర్వేనెంబర్ 86 లో గీతా ప్యానల్ ప్రోడక్ట్ పరిశ్రమలో వలస కూలీ దారుణ హత్యకు గురైంది.
రెండేళ్ల క్రితం రజనీ దేవి చౌహన్( Rajini Devi Chauhan ) (40), సూరజ్ ఈ గీతా ప్యానల్ ప్రోడక్ట్ ( Sooraj is a Geetha panel product )పరిశ్రమలో పని కోసం వచ్చారు.
పరిశ్రమ యజమాని ప్రవీణ్ పటేల్( Praveen Patel ) వీరికి పని ఇవ్వడంతో పాటు పరిశ్రమలో ఓ లేబర్ గదిని కూడా కేటాయించాడు.అప్పటినుండి వీరు పరిశ్రమలో పని చేసుకుంటూ సంతోషంగానే ఉండేవారు.అయితే ఈనెల 19వ తేదీ సూరజ్ ఆ గదికి తాళం వేసి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయాడు.
అయితే బుధవారం రోజు సూరజ్ తాళం వేసిన గది నుంచి దుర్వాసన రావడంతో పరిశ్రమలో పనిచేసే కార్మికులు యజమాని ప్రవీణ్ పటేల్ కు సమాచారం ఇచ్చారు.
పరిశ్రమ యజమాని ప్రవీణ్ పటేల్ ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.పోలీసులు పరిశ్రమ లో ఉండే ఆ లేబర్ గది తాళం పగలగొట్టి తలుపులు తీయగా రజనీ దేవి మృతదేహం కుళ్ళిన స్థితిలో కనిపించింది.పోలీసులు మృతదేహంతో పాటు ఆ గదిని క్షుణ్ణంగా పరిశీలించగా ఆమె హత్యకు గురైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, హత్య కేసు నమోదు చేసుకుని పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.సూరజ్ హత్య చేసి పారిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు.
ఆ కోణంలో దర్యాప్తు చేసి అన్ని విషయాలను త్వరలోనే వెలికి తీస్తామని పోలీసులు చెప్పారు.