కర్నాటకలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అధికార బీజేపీ( BJP )కి అసమ్మతి సెగలు తార స్థాయికి చేరుతున్నాయి.కాంగ్రెస్, జెడిఎస్ వంటి పార్టీలు తమ తమ అభ్యర్థుల ఫైనల్ ను విడుదల చేసి ప్రచారంలో దూసుకుపోతున్నాయి.
కానీ బీజేపీ మాత్రం అభ్యర్థుల ఎంపికలో తర్జనభర్జన పడుతూ ఈ బుదవారం రెండో జాబితాను విడుదల చేసింది.అయితే రెండవ జాబితా ప్రకటించినప్పటి నుంచి ఆ పార్టీలో అసమ్మతి సెగలు మరింత పెరిగినట్లు తెలుస్తోంది.
మొదటి జాబితాలో పేర్లు లేని నేతలంతా రెండవ జాబితపై గట్టిగానే ఆశలు పెట్టుకున్నారు.అయితే రెండవ జాబితాలో కూడా కొంతమందికి చోటు దక్కకపోవడంతో వారంతా కాషాయ పార్టీపై అసంతృప్తి గట్టిగానే వెళ్ళబుచుతున్నారు.
ఈ నేపథ్యంలో టికెట్ దక్కలేదనే అసంతృప్తి కారణంగా పలువురు ఎమ్మేల్యేలు, ఎంపీలు బీజేపీ కి గుడ్ బై చెప్పారు.పార్టీని వీడిన వారిలో మాజీ మంత్రి సొగడు శివణ్ణా, నెహ్రూ ఓలేకార్, కుమారస్వామి( Former Minister Sogadu Sivanna, Nehru Olekar, Kumaraswamy ) వంటి వాళ్ళు ఉన్నారు.ఇంకా వీరితో పాటు మరింకొంత మందికి కూడా కమలం పార్టీకి టాటా చెప్పి హస్తం గూటికి చేరేందుకు ప్రయత్నిస్తున్నారు.ఎన్నికలకు నెల రోజుల సమయం కూడా లేని నేపథ్యంలో నేతలు ఇలా పార్టీని విడుతుండడం బీజేపీని కలవర పెడుతున్న అంశం.
అసలే బీజేపీ పై ప్రజల్లో వ్యతిరేకత గట్టిగానే ఉంది.
దానికి తోడు సర్వేల ఫలితాలు కూడా బీజేపీని కలవర పడుతున్నాయి.ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న బీజేపీకి ములిగే నక్కపై తాటికాయ పడినట్లు ఎమ్మేల్యేలు, ఎంపీలు పార్టీకి టాటా చెబుతుండడంతో అధిష్టానం తలలు పట్టుకుంటోంది.వచ్చే ఎన్నికల్లో కూడా అధికారం చేజిక్కించుకోవాలని ఒకవైపు గట్టిపట్టుదలగా ఉంటే.
మరోవైపు ఇలా సొంత పార్టీ నేతలే.బై బై చెబుతుండడం ఆ పార్టీ సీనియర్ నేతల్లో కూడా విజయం పై అవకాశాలు సన్నగిల్లుతున్నాయి.
ఇక ఎన్నికల ముందు పార్టీని వీడే వారి సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.డబుల్ ఇంజన్ సర్కార్ ( Double engine Sarkar)పేరుతో కర్నాటక ఎన్నికల్లో రెండవసారి అధికారంలోకి రావాలని చూస్తున్న కాషాయ పార్టీకి అన్నీ వైపులా నుంచి పెరుగుతున్న అసంతృప్తి ఆ పార్టీ నేతలను కలవర పెడుతున్న అంశం.