గులాబీ తోటలో వికసించబోతున్న ఎర్ర మందారం

నల్లగొండ జిల్లా:మునుగోడు ఉప ఎన్నికలో తమ పార్టీ మద్దతు అధికార టీఆర్ఎస్ పార్టీకే ఇవ్వాలని నిర్ణయించినట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ప్రకటించారు.

శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నికల్లో సీపీఐ నిలబడే పరిస్థితి లేదని,అందుకే టీఆర్ఎస్ కు మద్దతివ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.

మునుగోడులో బీజేపీని ఓడించే సత్తా టీఆర్ఎస్కే ఉందని తేల్చి చెప్పిన చాడ,మునుగోడు బహిరంగ సభకు రావాలని కేసీఆర్ తమను ఆహ్వానించినట్లు తెలిపారు.బీజేపీని ఓడించడమే లక్ష్యంగా జాతీయ పార్టీ తీర్మానం ఉందని గుర్తుచేశారు.2018 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ,ఉత్తమ్ కుమార్ రెడ్డి తమ పార్టీని ఇబ్బంది పెట్టినట్లు పేర్కొన్నారు.అందుకే భవిష్యత్ లో కూడా కాంగ్రేస్ కు మద్దతు ఇవ్వబోమని సంకేతాలు ఇచ్చారు.

A Red Hibiscus About To Bloom In A Rose Garden-గులాబీ తోటల�

టీఆర్ఎస్ మైత్రి మునుగోడు వరకే పరిమితం కాదని,భవిష్యత్లోనూ టీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేస్తామని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Latest Nalgonda News