సైబర్ నేరగాళ్లు( Cyber criminals ) రోజురోజుకు కొత్త తరహా మోసాలతో అమాయక ప్రజలను దోచుకోవడం క్రమంగా పెరుగుతూ పోతోంది.ఇప్పటివరకు ఆన్ లైన్ ద్వారా చోరీలకు పాల్పడే సైబర్ నేరగాళ్లు తాజాగా ఆఫ్ లైన్ ద్వారా కూడా అమాయక ప్రజలను మోసం చేసే ఓ కొత్త తరహా మోసానికి పాల్పడుతున్నారు.
చార్జింగ్ పెట్టుకునే ఛార్జింగ్ కేబుల్( Charging cable ) ద్వారా స్మార్ట్ ఫోన్లో ఉండే డేటాను దొంగలించే కొత్త విధానాన్ని కనుగొన్నారు.అంటే చార్జర్ లలో, కేబుల్ లలో సాఫ్ట్వేర్ అమర్చి మోసాలకు పాల్పడుతున్నారు.

ప్రయాణాలు చేసేవాళ్లు స్మార్ట్ ఫోన్ లో చార్జింగ్ అయిపోతే బస్టాండ్, రైల్వే స్టేషన్స్( Bus Stand, Railway Stations ) లాంటి ప్రాంతాల్లో చార్జింగ్ పెట్టుకుంటారని అందరికీ తెలిసిందే.పబ్లిక్ ప్లేస్ లలో స్మార్ట్ ఫోన్లకు చార్జింగ్ పెట్టుకునే అమాయక ప్రజలే సైబర్ నేరగాళ్ల టార్గెట్.పబ్లిక్ ప్లేస్ లలో చార్జింగ్ పాయింట్స్ లో ముందుగానే హ్యాకింగ్ సాఫ్ట్వేర్ అమర్చిన చార్జర్, కేబుల్స్ పెట్టి వదిలేస్తున్నారు.ఎవరైనా పొరపాటున కూడా ఆ చార్జర్, కేబుల్స్ లతో చార్జింగ్ పెట్టుకుంటే.
స్మార్ట్ ఫోన్ లో ఉండే డేటా అంత హ్యాకర్ల చేతికి వెళ్తుంది.

ఈ కొత్త తరహా మోసాన్ని జ్యూస్ జాకింగ్( Juice jacking ) అంటారు.సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసి డేటాను దొంగలించి, ఆ తర్వాత డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడతారు.లేదంటే బ్యాంకింగ్ డీటెయిల్స్ హ్యక్ చేసేస్తారు.
ఈ మధ్యకాలంలో ఈ కొత్త తరహా మోసానికి చాలామంది అమాయకులు బలైపోయారు.కాబట్టి బహిరంగ ప్రదేశాల్లోని చార్జింగ్ పోర్టులకు స్మార్ట్ ఫోన్ కనెక్ట్ చెయ్యకపోవడమే మంచిది.
ప్రయాణాలు చేసేవారు పవర్ బ్యాంక్ లాంటివి వాడితే ఇంకా సేఫ్ గా ఉండొచ్చు.ప్రయాణాలలో తమ వెంట పవర్ బ్యాంకుతోపాటు సొంత చార్జర్ ని ఉపయోగించాలి.
సైబర్ మోసాల బారిన పడిన వెంటనే సైబర్ క్రైమ్ పోర్టల్ లో కంప్లైంట్ చేయాలని సైబర్ పోలీసులు సూచిస్తున్నారు.