రైలు ప్రమాదంలో తల్లి ఇద్దరు పిల్లలు మృతి

గుంటూరులో జిల్లా నడికుడి రైల్వేస్టేషన్ పరిధిలో ఘటన.మృతులు నల్లగొండ జిల్లా వాసులు కావడంతో జిల్లాలో విషాద ఛాయలు.

కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన రైల్వే పోలీసులు.గుంటూరు బయలుదేరిన కుటుంబ సభ్యులు.

A Mother And Two Children Were Killed In A Train Accident-రైలు ప్ర

ప్రమాదంపై వ్యక్తమవుతున్న అనుమానాలు.నల్లగొండ జిల్లా:గుంటూరు జిల్లా నడికుడి రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది.రైల్వే పట్టాలు దాటుతుండగా ఫలక్ నామా ఎక్స్ ప్రెస్ ఢీ కొనడంతో ఇద్దరు పిల్లలతో సహా తల్లి అక్కడిక్కడే మృతి చెందారు.

ఈ ఘటన నల్లగొండ జిల్లాలో విషాదం నింపింది.వివరాల్లోకి వెళితే నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని నార్కట్ పల్లి మండలం ఔరవాణి గ్రామానికి చెందిన గాదె జాన్ రెడ్డి-రమ్యలు గత కొన్నేళ్ళుగా నల్లగొండ పట్టణంలోని చైతన్యపురి కాలనీలో నివాసముంటున్నారు.

Advertisement

వారికి రిషిక్ రెడ్డి(7), హంసికారెడ్డి (5)అనే ఇద్దరు పిల్లలున్నారు.ఇద్దరు పిల్లలు నల్లగొండ పట్టణంలోని దేవరకొండ రోడ్ లోని ప్రేరణ స్కూల్లో చదువుతున్నారు.ఏమైందో ఏమోకానీ, సోమవారం రాత్రి గుంటూరు జిల్లా నడికుడి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఢీ కొని తల్లి ఇద్దరు పిల్లలు ముగ్గురు అక్కడిక్కడే మృత్యువాత పడ్డారు.

ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం సత్తెనపల్లి ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు.గుంటూరు రైలు ప్రమాదానికి సంబంధించిన సమాచారాన్ని రైల్వే పోలీసులు కుటుంబ సభ్యులకు అందించడంతో,కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ అక్కడికి బయలుదేరారు.

తల్లితో పాటు ఇద్దరు పిల్లలు కూడా రైలు ప్రమాదంలో మరణించడంతో వారు ప్రస్తుతం నివాసముంటున్న నల్గొండ చైతన్యపురి కాలనీలో, స్వగ్రామం నార్కెట్ పల్లి మండలంలోని ఔరవాణి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.రమ్య ఆమె ఇద్దరు పిల్లలు నడికుడ రైల్వే స్టేషన్ సమీపంలో మృతి చెందిన ఘటనకు సంబంధించి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదిలా ఉండగా రమ్య తన ఇద్దరి పిల్లలను తీసుకుని గుంటూరుకు ఎప్పుడెళ్లింది? ఎందుకెళ్లింది? నడికుడి రైల్వే స్టేషన్ సమీపంలో రాత్రి సమయంలో పట్టాలు ఎందుకు దాతుంటుంది? ఇది ప్రమాదమా? లేక సామూహిక ఆత్మహత్యలా? అనేది పోలీసులు దర్యాప్తులో తేలాల్సి ఉంది.ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
Advertisement

Latest Nalgonda News