విలేఖరిపై దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు

నల్లగొండ జిల్లా: పేపర్ లో తన పేరు ఎందుకు రాయలేదని ఓ జర్నలిస్ట్ పై దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు విజయపురి టౌన్ ఎస్ఐ సురభి సంపత్ తెలిపారు.

గురువారం ఎస్ఐ సురభి సంపత్ ప్రెస్ నోట్ విడుదల చేస్తూ వివరాలను వెల్లడించారు.

నల్లగొండ జిల్లా నందికొండ మున్సిపల్ పరిధిలోని బీసీ కాలనీలో గత నెల 29 న జరిగిన వినాయకుని లడ్డూ వేలంపాట, నిమజ్జన కార్యక్రమంపై పైలాన్ కాలనీకి చెందిన సాయికృష్ణ అనే జర్నలిస్టు వార్త కవర్ చేశారు.పేపర్ లో తన పేరు ఎందుకు రాయలేదని పైలాన్ కాలనీకి చెందిన ఉపేందర్ సాయికృష్ణను అడ్డగించి,అసభ్య పదజాలంతో దూషిస్తూ,చెంపపై బలంగా కొట్టాడని బాధిత జర్నలిస్ట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టామని చెప్పారు.

భవిష్యత్తులో ఎవరైనా జర్నలిస్టులపై దాడి చేస్తే వారిపై కేసు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Bet365: Mejores Juegos Y Slots En Argentina (AR) — Análisis Comparativo
Advertisement

Latest Nalgonda News