సూపర్ స్టార్ మహేష్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే.మహేష్ కి ఇండస్ట్రీలో ఉన్న అతికొద్ది మంది స్నేహితులలో త్రివిక్రమ్ ఒకరు.
అందుకే ఒకరి సినిమాతో మరొకరు పోటి పడకుండా మాట్లాడుకున్నారు.ఇప్పుడు ఇచ్చిన మాట మీద నిలబడుతున్నాడు త్రివిక్రమ్.
బ్రహ్మోత్సవం, అ.ఆ , రెండూ కూడా మే నెలలోనే విడుదలకి సిద్ధమయ్యాయి.మహేష్ విడుదల చేసుకున్నాక కనీసం రెండువారాల గ్యాప్ ఇచ్చే తన సినిమా విడుదల చేసుకుంటానన్నాడు త్రివిక్రమ్.మొదట బ్రహ్మోత్సవం విడుదల తేది మే 6న అనుకుంటే, మే 20న అ.ఆ విడుదల చేస్తామని నిర్ణయించుకున్నాడు త్రివిక్రమ్.కాని బ్రహ్మోత్సవం మే 20కి షిఫ్ట్ అయిపోయింది.
ఇప్పుడు త్రివిక్రమ్ కుడా అ.ఆ విడుదల తేది మార్చుకున్నాడు.బ్రహ్మోత్సవం విడుదలైన రెండువారాలకి, అంటే జూన్ 3న తన సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు మొదలుపెట్టాడు.
అ.ఆ చిత్రానికి వేసవి సెలవులు తక్కువే దొరుకుతున్నాయి ఈ నిర్ణయంతో, కాని మహేష్ కోసం పెద్ద త్యాగమే చేసేశాడు త్రివిక్రమ్.