నాగార్జునపై జోకులేస్తున్న శ్రీనువైట్ల

కామెడి పండిచండంలో ఈ తరం దర్శకులలో శ్రీనువైట్లని మించినవారు లేరు.ఎదో గత రెండు సినిమాలు ఫ్లాపులు అయ్యాయి కాని, ఆగడు, బ్రూస్ లీ సినిమాలకి ముందు శ్రీనువైట్ల సినిమాలు చూస్తూ తృప్తిగా నవ్వుకునేవారు ప్రేక్షకులు.

 Sreenu Vaitla’s Mister To Have A Spoof On Oopiri-TeluguStop.com

కాస్త లోతుగా గమనిస్తే, ఆయన సినిమాల్లో ఎదో ఒక విషయం మీద స్పూఫ్ ఉంటుంది.దూకుడులో రియాలిటి షోల మీద, బాద్షా లో ఇంసెప్షన్ సినిమా మీద, ఆగడులో మీలో ఎవరు కోటీశ్వరుడు షో మీద, బ్రూస్ లీ లో ఆమీర్ ఖాన్ పీకే సినిమా మీద సెటైర్లు, వాటిని అల్లుకొని చేసే కామెడి ఉంటుంది

శ్రీనువైట్ల తదుపరి సినిమా పేరు “మిస్టర్”.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇందులో కథానాయకుడు.లావణ్య త్రిపాఠి, హెబా పటేల్ కథానాయికలు.

ఇక ఈ చిత్రంలో నాగార్జున కార్తి నటించిన “ఊపిరి” చిత్రానికి సంబంధించి స్పూఫ్ ఉంటుందని సమాచారం.నాగార్జున-కార్తి పాత్రల్ని అనుకరిస్తూ జోకులు ఎవరు వేస్తారనేది తెలియరాలేదు

గోపీమోహన్ , శ్రీధర్ శ్రీపణ రచన అందించనున్న ఏ చిత్రాన్ని నల్లమలుపు బుజ్జి, ఠాగూర్ మధు సంయుక్తంగా నిర్మిస్తారు.

మిక్కి జే మేయర్ సంగీతం అందిస్తారు.మే 15వ తేదినా మిస్టర్ ప్రారంభం కానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube