యూకేలో భారతీయ టెక్కీకి 15 రోజుల క్రిస్మస్ సెలవులు.. ఇండియాలో ఇంటర్నెట్ షేక్

క్రిస్మస్, న్యూ ఇయర్ సెలవుల గురించి భారత సంతతి టెక్కీ చేసిన ట్వీట్ దేశంలోని 365 రోజుల పని సంస్కృతిపై భారత్‌లో తీవ్ర చర్చనీయాంశమైంది.సదరు టెక్కీని వివేక్ పంచాల్‌గా( Vivek Panchal ) గుర్తించారు.

 Uk Firm Grants Indian Techie Extended Leave For Christmas Sparking Online Detail-TeluguStop.com

యూకే( UK ) కేంద్రంగా ఉన్న కంపెనీలో పనిచేయడం వల్ల కలిగే ప్రయోజనాలు అనే క్యాప్షన్‌తో చేసిన ఈ ట్వీట్‌లో పలు స్క్రీన్‌ షాట్లు పోస్ట్ చేశారు.క్రిస్మస్,( Christmas ) న్యూఇయర్‌కు( New Year ) కలిపి డిసెంబర్ 23 నుంచి జనవరి 6 వరకు తమ కంపెనీ సెలవులు ఇచ్చినట్లుగా అతను తెలిపాడు.

పని సంస్కృతులు, సెలవుల ఆవశ్యకత, పని దినాల విషయానికి వస్తే భారత్- ఇతర దేశాల మధ్య వ్యత్యాసంపై ఈ పోస్ట్ హాట్ టాపిక్‌గా మారింది.ఈ పోస్ట్ 5,00,000కు పైగా ఇంప్రెషన్‌లను పొందింది.

దీనికి పలువురు నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు.భారత్( India ) సహా కొన్ని ఆసియా దేశాలు మాత్రమే క్లయింట్ వైఖరిని అనుసరిస్తున్నాయి.

మెజారిటీ కంపెనీలు 24×7, 365 రోజుల పని వ్యూహాన్ని అమలు చేస్తున్నాయని ఓ యూజర్ కామెంట్ పెట్టాడు.

Telugu Christmas, India, Indian Techie, Infosysyana, Vivek Panchal, Hours, Balan

మరొకరైతే.భారతదేశంలోనూ ఇలాంటి లాంగ్ హాలిడేస్ కావాలని, దీపావళికి 2 రోజులు సరిపోవన్నారు.మరికొందరైతే ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి( Infosys Narayana Murthy ) చెబుతున్న 70 గంటల పని దినాల గురించి గుర్తుచేస్తున్నారు.

రెండు మూడు దశాబ్ధాల్లోగా అభివృద్ధి చెందిన దేశాలను చేరుకోవడానికి భారతదేశంలోని యువ నిపుణులు వారానికి 70 గంటలు పనిచేయడాన్ని పరిగణించాలని మూర్తి గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే.

Telugu Christmas, India, Indian Techie, Infosysyana, Vivek Panchal, Hours, Balan

ఆయన వ్యాఖ్యలు భారతదేశంలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్, ఉత్పాదకత, శ్రేయస్సు తదితర అంశాలపై సామాజిక వేదికలలో తీవ్ర చర్చకు దారి తీశాయి.గ్లోబల్ డేటా అండ్ బిజినెస్ ఇంటెలిజెన్స్ ఫ్లాట్‌ఫాం అయిన స్టాటిస్టా గతేడాది వెలువరించిన నివేదిక ప్రకారం.భారతదేశంలోని 4 శాతం మంది ఉద్యోగులు తమ పని గంటలలో( Work Hours ) ఎక్కువ భాగం ఉత్పాదకత గురించి కాకుండా బిజీగా గడుపుతున్నారు.

ఈ అధ్యయనం జరిగిన తొలి 9 దేశాలలో భారతదేశం మొదటి స్థానంలో ఉండగా జపాన్, సింగపూర్‌లు మన కంటే వెనుకబడి ఉన్నాయి.అసోచామ్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం.భారతదేశంలోని 42.5 శాతం కార్పోరేట్ ఉద్యోగులు నిరాశ, ఆందోళనలతో బాధపడుతున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube