ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్( Allu Arjun ) వివాదం సంచలనంగా మారడంతో పాటు హాట్ టాపిక్ గా మారింది.ఎక్కడ చూసినా కూడా ఇదే విషయం గురించి చర్చించుకుంటున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసినా కూడా ఇదే విషయం గురించి చర్చించుకుంటున్నారు.అటు రాజకీయాలలో ఇటు సినిమా ఇండస్ట్రీలో కూడా ఇదే హాట్ టాపిక్ గా మారింది.
ఈ కేసు సద్దుమనుగుతుంది అనుకుంటున్న నేపథ్యంలో రోజుకో మలుపు తిరుగుతూనే ఉంది.ఇలా గత రెండు వారాలుగా ఇదే సంచలనంగా మారింది.
అందులో భాగంగానే తాజాగా మరోసారి పోలీసులు అల్లు అర్జున్ కి నోటీసులు పంపించిన విషయం తెలిసిందే.మంగళవారం విచారణకు హాజరు కావాలని ఆ నోటీస్ సారాంశం.అయితే ఈ రోజు 11 గంటలకు బన్నీ తన లీగల్ టీమ్ తో కలిసి విచారణకు హాజరు అయినట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో ఈ విషయంపై స్పందించాలని కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను( Choreographer Jani Master ) మీడియా కోరగా.
ఈ విషయంలో నేనేం మాట్లాడదలుచుకోలేదు.నేనే ఒక ముద్దాయిని.
నాపై ఆరోపణలు ఉన్నాయి.నా కేసు కోర్టులో ఉంది.
కాబట్టి నేను ఇప్పుడు మాట్లాడటం కరెక్ట్ కాదు.న్యాయ స్థానంపై, నాకు నమ్మకం ఉంది.
అందరికీ మంచి జరగాలి అని జానీ మాస్టర్ అన్నారు.అనంతరం జైలుకు వెళ్లకముందు.వెళ్లొచ్చిన తర్వాత మీకు ఇండస్ట్రీలో మర్యాద ఎలా ఉంది? అని అడగగా ఒకేలా ఉందని జానీ మాస్టర్ సమాధానమిచ్చాడు.గుండెల మీద చెయ్యి వేసి మరీ చెబుతున్నా పరిశ్రమలు నా గుర్తింపు, గౌరవం ఎప్పటిలాగే ఉంది అని అన్నారు జానీ మాస్టర్.
ఈ సందర్భంగా జానీ మాస్టర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.మరోవైపు అల్లు అర్జున్ అభిమానులు అల్లూ ఫ్యామిలీ ఈ వ్యవహారం ఎంత దూరం వెళుతుందో తెలియక తలలు పట్టుకుంటున్నారు.