బక్కగా ఉన్న పిల్లలు బరువు పెరిగి బ‌లంగా మారాలంటే ఇలా చేయండి!

సాధారణంగా కొందరు పిల్లలు వయసుకు తగ్గ బరువు ఉండరు.బక్కగా చాలా బలహీనంగా ఉంటారు.

 This Nuts Milkshake Helps Gain Weight In Kids! Weight Gain, Weight Gain Milk Sha-TeluguStop.com

ఇలాంటి పిల్లలు చదువుల్లోనే కాదు ఆటపాటల్లో కూడా చురుగ్గా ఉండలేరు.ఎప్పుడూ నీరసంగా కనిపిస్తుంటారు.

అయితే బక్కగా ఉన్న పిల్లలు బరువు పెరిగి(weight gain) బలంగా ఆరోగ్యంగా మారాలంటే తల్లిదండ్రులు కచ్చితంగా ప్రత్యేక శ్రద్ధ వహించాలి.వారి డైట్ లో పోషకాలతో కూడిన ఆహారాలను చేర్చాలి.

ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే మిల్క్ షేక్ పిల్లల బరువును పెంచడానికి అద్భుతంగా తోడ్పడుతుంది.

అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఎనిమిది బాదం గింజలు(Almonds), ఐదు నుంచి ఆరు జీడిపప్పు(Six cashews), ఐదు పిస్తా గింజలు(Pistachio nuts), ఐదు నల్ల ఎండు ద్రాక్ష (grapes) మరియు మూడు గింజ తొలగించిన ఖర్జూరాలు(Dates) వేసుకోవాలి.

ఆపై అందులో ఒక గ్లాస్ కాచి చల్లార్చిన పాలు మరియు చిటికెడు కుంకుమ పువ్వు వేసి బాగా కలిపి గంట పాటు నానబెట్టుకోవాలి.ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో నానబెట్టుకున్న పదార్థాలను వేసి మెత్తగా బ్లెండ్ చేసుకుంటే మన హెల్తీ అండ్ టేస్టీ నట్స్ మిల్క్ షేక్ అనేది రెడీ అవుతుంది.

Telugu Tips, Latest, Nuts Milkshake, Milk Shake-Telugu Health

నిత్యం పిల్లలకు ఈ మిల్క్ షేక్ ను ఇస్తే ఎంతో ఇష్టంగా తాగుతారు.పైగా ఆరోగ్యపరంగా కూడా ఈ మిల్క్ షేక్ ఎన్నో ప్రయోజనాలు చేకూరుస్తుంది.ప్రధానంగా పిల్లల బరువును(Child’s weight) పెంచడానికి, వారిని బలంగా మార్చడానికి ఈ నట్స్ మిల్క్ షేక్ తోడ్పడుతుంది.అలాగే నట్స్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగుప‌రుస్తుంది.

మలబద్ధకాన్ని నివారిస్తుంది.

Telugu Tips, Latest, Nuts Milkshake, Milk Shake-Telugu Health

న‌ట్స్ మిల్క్ షేక్‌(Nuts Milk Shake) ఎన‌ర్జీ బూస్ట‌ర్ గా ప‌ని చేస్తుంది.నీర‌సం, అల‌స‌ట ద‌రి చేర‌కుండా అడ్డుకుంటుంది.నట్ మిల్క్‌షేక్ లో కాల్షియం మరియు విటమిన్ డి ఉంటాయి.

ఇవి ఆరోగ్యకరమైన ఎముకలు మరియు దంతాలకు మ‌ద్ద‌తు ఇస్తాయి.ఇక న‌ట్స్ మిల్క్ షేక్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యకరమైన దృష్టిని ప్రోత్సహిస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube