అర్ధరాత్రి పోలీసులను పిలిపించిన మందుబాబు.. ఏం కంప్లైంట్ ఇచ్చాడో తెలిస్తే నవ్వేనవ్వు..

మందుబాబులు చేసే పనులు వింటే ఒక్కోసారి మనము ఆశ్చర్యపోగ తప్పదు.ఒక్కోసారి వారి పనులు చూసి నవ్వాలో ఏడవాలో కూడా తెలియని పరిస్థితి నెలకొంటుంది.

 Madhubabu Who Called The Police In The Middle Of The Night I Would Laugh If I Kn-TeluguStop.com

మద్యం మత్తులో వారు ఏం చేస్తున్నారో కూడా వారికి అర్థం కాదు.కొన్నిసార్లు వారు చాలా ధైర్యం చూపిస్తుంటారు.

తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయిలో (Hardoi, Uttar Pradesh)ఇలాంటి ఓ విచిత్రమైన సంఘటన జరిగింది.మద్యం తాగిన ఓ వ్యక్తి అర్ధరాత్రి( police) పోలీసులకు ఫోన్ చేశాడు.

ఎవరో తన 250 గ్రాముల బంగాళాదుంపలు దొంగతనం చేశారని తాపీగా ఫిర్యాదు చేశాడు.చాలా విలువైన సంపద కోల్పోయినట్లుగా ఆగ్రహం కూడా వ్యక్తం చేశాడు.

పోలీసులు తన పోగొట్టుకున్న బంగాళాదుంపలు(potatos) కనుక్కోవాలని డిమాండ్ చేశాడు.అయితే అధికారులు అతని ఫోన్ కట్ చేయలేదు అడ్రస్ కనుక్కున్నారు.అతని ఇంటికి వచ్చి, అతని మాటలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.వీడియోలో ఆ వ్యక్తి పోలీసులతో తన బాధ చెప్పుకుంటున్నాడు.

అతను బంగాళాదుంపలు పొట్టు తీసి, తర్వాత వండుకోవడానికి ఇంట్లో పెట్టానని చెప్పాడు.కానీ మద్యం తాగి తిరిగి వచ్చేసరికి బంగాళాదుంపలు కనిపించలేదట.

అందుకే 112కు కాల్ చేసినట్లు వివరించాడు.

ఈ మందుబాబు పేరు విజయ్ వర్మ(Vijay Verma).ఆయన ఫిర్యాదు చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఆ వీడియోలో విజయ్ వర్మ తాను మద్యం తాగి ఉన్నానని ఒప్పుకున్నాడు.

అయినా, తన బంగాళాదుంపలు ఎవరు తీసుకెళ్లారో తెలుసుకొని వారిపై కేసు పెట్టాలని పోలీసులను కోరాడు.పోలీసులు విజయ్ వర్మను మాటలు పూర్తిగా విన్నారు.కానీ ఆయన మాటలు విని నవ్వులు ఆపుకోలేకపోయారు.విజయ్ వర్మ ఏ రకమైన మద్యం తాగాడో కూడా పోలీసులు అడిగారు.

విజయ్ వర్మ మాత్రం తాను తాగిన మద్యం తనదే అని, ఎవరి దగ్గర నుంచి అప్పుగా తీసుకోలేదని చెప్పాడు.తన డబ్బులతో తాను మద్యం తాగితే తప్పేం కాదు కదా అని కూడా తిరిగి ప్రశ్నించాడు.

ఆ వ్యక్తి పోలీసులతో, “నా బంగాళాదుంపలు ఎవరో తీసుకెళ్లారు.సుమారు 250 గ్రాములు ఉంటాయి.నేను నాలుగు గంటలకు పొట్టు తీసి, తర్వాత వండుకోవడానికి పెట్టాను.తిని తాగి వచ్చేసరికి ఎవరో దొంగ వాటిని తీసుకెళ్లారు.ఈ విషయం మీరు విచారించాలి” అని చెప్పాడు.వైరల్ వీడియో పైన నెటిజన్లు కామెంట్లు చేస్తూ “ఆయన చాలా నిజాయితీగా ఉన్నాడు.

ఆలుగడ్డలు(potato) కాజేసారని చెప్పాడు, ఎవరికీ హాని చేయలేదు, తన డబ్బుతోనే మద్యం తాగుతాడు.కనీసం నిజం చెప్పాడు, ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు” అని కామెంట్ చేశారు.

మరొకరు నవ్వుతూ, “ఈ కేసులో సీఐడీ లేదా సీబీఐ వాళ్ళు వెంటనే దర్యాప్తు చేయాలి.త్వరగా బంగాళాదుంపలు దొరికేలా చూడాలి” అని కామెంట్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube