అమెరికాలో( America ) చదువుకుంటున్న భారతీయ విద్యార్ధుల సంఖ్య నానాటికీ పెరుగుతున్న సంగతి తెలిసిందే.భారతీయ విద్యార్ధులకు ఇండియన్ ఎంబసీ,( Indian Embassy ) ప్రవాస భారతీయులు అండగా నిలుస్తున్నారు.
తాజాగా వాషింగ్టన్‌లోని( Washington ) భారత రాయబార కార్యాలయం ‘MARG’ (మెంటరింగ్ ఫర్ అకడమిక్ అండ్ రీసెర్చ్ గైడెన్స్) అనే వర్చువల్ మెంటరింగ్ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టింది.ఇది భారతీయ విద్యార్ధులు, ( Indian Students ) పరిశోధకులను అమెరికాలోని విశ్వవిద్యాలయాలతో , ప్రత్యేకించి చిన్న నగరాలు, పట్టణాలతో అనుసంధానించే లక్ష్యంతో ఏర్పాటు చేశారు.
అధ్యయన రంగాలలో తాజా పరిణామాలు, అలాగే భారత సంతతికి చెందిన నిపుణుల నుంచి వారి అనుభవాలు, నైపుణ్యం, పరిశోధన అవకాశాలను బహిర్గతం చేయడం ఈ కార్యక్రమం లక్ష్యం.స్టాన్‌ఫోర్డ్, పర్డ్యూ, యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్, జార్జ్ మాసన్ యూనివర్సిటీ వంటి ప్రసిద్ధ అమెరికా విశ్వవిద్యాలయాల( US Universities ) నుంచి అధ్యాపకులు ఈ కార్యక్రమం మొదటి రౌండ్‌లో పాల్గొంటున్నారు.ప్రారంభ సెషన్‌లో డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ అంబాసిడర్ శ్రీ ప్రియా రంగనాథన్ ప్రసంగించారు.సెమీకండక్టర్స్, ఏఐ , మెషిన్ లెర్నింగ్, హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్, క్వాంటమ్ సైన్స్ వంటి క్లిష్టమైన, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలలో భారత పరిశోధన, నైపుణ్యం, ఇండస్ట్రియల్ ఎకో సిస్టమ్ వృద్ధిని గురించి ఆమె నొక్కి చెప్పారు.
భారత్ – అమెరికా మధ్య విద్యా, పరిశోధన, సాంకేతిక భాగస్వామ్యాన్ని పెంపొందించడంలో ఈ రంగాలు ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి.ఈ మెంటరింగ్ ప్రోగ్రామ్‌లో( Mentoring Program ) పాల్గొనే విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు, డైరెక్టర్ల ప్రకారం.ఈ సెషన్‌లు టీచింగ్, స్కిల్ డెవలప్‌మెంట్, అభివృద్ది చెందుతున్న సాంకేతిక రంగాలలో పరిశోధనలో నిమగ్నమైన విద్యార్ధులు, అధ్యాపకులకు సహాయపడతాయి.MARG ద్వారా పాల్గొనేవారు విద్యా, వృత్తిపరమైన అనుభవాన్ని పొందుతారని నిర్వాహకులు చెబుతున్నారు.
తమ భవిష్యత్, అభివృద్ధి కోసం భారత రాయబార కార్యాలయం తీసుకున్న చొరవ పట్ల భారతీయ విద్యార్దులు ధన్యవాదాలు తెలిపారు .