ప్రజావాణి దరఖాస్తులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలి - జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్న సిరిసిల్ల జిల్లా: ప్రజావాణి దరఖాస్తులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు.జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియం లో ప్రజల నుంచి కలెక్టర్ సోమవారం అర్జీలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.ప్రజావాణికి వచ్చే దరఖాస్తులు పెండింగ్ లో పెట్టవద్దని కలెక్టర్ ఆదేశించారు.

 Prajavani Applications Should Be Resolved From Time To Time District Collector S-TeluguStop.com

ఆయా శాఖలకు వచ్చిన దరఖాస్తులు.రెవెన్యూ శాఖకు 47, సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయానికి 7, డీపీఓకు 3, ఉపాధి కల్పన కార్యాలయానికి 5, జిల్లా సంక్షేమ శాఖ కు రెండు, తంగళ్లపల్లి ఎంపీడీవో కార్యాలయానికి 2, గంభీరావుపేట ఎంపీడీవో కార్యాలయానికి 7, ముస్తాబాద్ ఎంపీడీవో కార్యాలయానికి 1, ఇల్లంతకుంట ఎంపీడీవో కార్యాలయానికి 2, డి ఆర్ డి ఓకు ఆరు,ఆర్ అండ్ బీ, వ్యవసాయ శాఖకు మూడు, ఎక్సైజ్ శాఖకు, పౌర సరఫరాల శాఖ మూడు, నీటిపారుదల శాఖ, విద్యాశాఖ, ఎస్పీ ఆఫీసుకు రెండు చొప్పున, ఎల్ డి ఎం, ఎస్ డి సి, డి ఎం హెచ్ ఓ, డి ఎస్ సి డి ఓ, సర్వే, ట్రెజరీ, సెస్, డీపీ ఆర్ ఓ కార్యాలయాలకు ఒకటి చొప్పున వచ్చాయి.

మొత్తం 102 వచ్చినట్లు అధికారులు తెలిపారు.ఇక్కడ అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube