ప్రజావాణి దరఖాస్తులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలి – జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్న సిరిసిల్ల జిల్లా: ప్రజావాణి దరఖాస్తులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు.

జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియం లో ప్రజల నుంచి కలెక్టర్ సోమవారం అర్జీలు స్వీకరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.ప్రజావాణికి వచ్చే దరఖాస్తులు పెండింగ్ లో పెట్టవద్దని కలెక్టర్ ఆదేశించారు.

ఆయా శాఖలకు వచ్చిన దరఖాస్తులు.రెవెన్యూ శాఖకు 47, సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయానికి 7, డీపీఓకు 3, ఉపాధి కల్పన కార్యాలయానికి 5, జిల్లా సంక్షేమ శాఖ కు రెండు, తంగళ్లపల్లి ఎంపీడీవో కార్యాలయానికి 2, గంభీరావుపేట ఎంపీడీవో కార్యాలయానికి 7, ముస్తాబాద్ ఎంపీడీవో కార్యాలయానికి 1, ఇల్లంతకుంట ఎంపీడీవో కార్యాలయానికి 2, డి ఆర్ డి ఓకు ఆరు,ఆర్ అండ్ బీ, వ్యవసాయ శాఖకు మూడు, ఎక్సైజ్ శాఖకు, పౌర సరఫరాల శాఖ మూడు, నీటిపారుదల శాఖ, విద్యాశాఖ, ఎస్పీ ఆఫీసుకు రెండు చొప్పున, ఎల్ డి ఎం, ఎస్ డి సి, డి ఎం హెచ్ ఓ, డి ఎస్ సి డి ఓ, సర్వే, ట్రెజరీ, సెస్, డీపీ ఆర్ ఓ కార్యాలయాలకు ఒకటి చొప్పున వచ్చాయి.

మొత్తం 102 వచ్చినట్లు అధికారులు తెలిపారు.ఇక్కడ అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

అజ్ఞాతవాసి ఫ్లాప్ గురించి అలా కామెంట్స్ చేసిన నాగవంశీ.. అసలేం జరిగిందంటే?