టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో దర్శకుడు శంకర్( Director Shankar ) ఒకప్పుడు సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కావు.జెంటిల్ మాన్,( Gentleman ) ప్రేమికుడు,( Premikudu ) భారతీయుడు,( Bharateeyudu ) జీన్స్, ఒకే ఒక్కడు, బాయ్స్, అపరిచితుడు, శివాజీ, రోబో సినిమాలు తెరకెక్కి సంచలన విజయాలు సాధించాయి.
ఈ సినిమాలు ప్రేక్షకులను సైతం ఎంతగానో ఆకట్టుకున్నాయనే చెప్పాలి.శంకర్ తీసిన సినిమాలు ఎంతోమంది యంగ్ డైరెక్టర్లకు స్పూర్తిగా నిలిచాయి.
సినిమా సినిమాకు భిన్నమైన కాన్సెప్ట్ ను ఎంచుకోవడం ద్వారా శంకర్ సత్తా చాటారు.అయితే ఆ శంకర్ కు ఈ శంకర్ కు చాలా తేడా ఉందని ప్రస్తుతం శంకర్ భారీ బడ్జెట్ తో సినిమాలను తెరకెక్కిస్తున్నా ఆ సినిమాలు ప్రేక్షకులను మెప్పించడం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
శంకర్ ఎందుకు ఇలాంటి సినిమాలను తెరకెక్కిస్తున్నారో అస్సలు అర్థం కావడం లేదని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
శంకర్ కు సరైన రచయిత ప్రస్తుత పరిస్థితుల్లో అవసరమని మరి కొందరు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.శంకర్ రాబోయే రోజుల్లో కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాలి.శంకర్ తో సినిమాలను నిర్మిస్తున్న నిర్మాతలు సైతం నిండా మునిమిగిపోతున్నారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
శంకర్ రెమ్యునరేషన్( Shankar Remuneration ) సైతం భారీ స్థాయిలో ఉండటం గమనార్హం.
శంకర్ సినిమాలు( Shankar Movies ) తలనొప్పి తెప్పిస్తున్నాయని కొంతమంది కామెంట్లు చేస్తున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతుంది.శంకర్ సినిమాలకు గతంతో పోల్చి చూస్తే బిజినెస్ తగ్గుతోందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.శంకర్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ తగ్గుతోంది.
రాజమౌళి ఒకప్పుడు శంకర్ స్థాయి దర్శకుడు అవుతాడా అనే చర్చ జరిగింది.ఇప్పుడు మాత్రం శంకర్ రాజమౌళి స్థాయిని అందుకోలేకపోతున్నారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.