ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి ( Syamaladevi )గురించి ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.శ్యామలాదేవి ఇంటర్వ్యూలు ఇస్తే ఆ ఇంటర్వ్యూలలో చెప్పిన విషయాలు సైతం తెగ వైరల్ అవుతాయి.
శ్యామలాదేవి తాజాగా మాట్లాడుతూ వెయ్యి మంది స్టార్స్ కలిస్తే నా కొడుకు అంటూ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు కల్కి సినిమా( Kalki movie ) అద్భుతంగా ఉందని సినిమా చూస్తున్న సమయంలో ఒకటే విజిల్స్ క్లాప్స్ అని చెప్పుకొచ్చారు.
కల్కి సినిమాను ప్రతి ఒక్కరూ థియేటర్ లో ఎంజాయ్ చేస్తున్నారని విదేశాల నుంచి కూడా ఈ సినిమా వండర్ అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు.
ప్రభాస్ ( Prabhas )యూనివర్సల్ హీరో కంటే ఎక్కువ అని వెయ్యి మంది రెబల్ స్టార్ లు కలిస్తే మా రెబల్ స్టార్ ప్రభాస్ ఒక్కడు అని శ్యామలాదేవి అభిప్రాయం వ్యక్తం చేశారు.పవన్ ఫ్యాన్స్ సపోర్ట్ కూడా లభించడం కల్కికి ప్లస్ అయింది.
ఈరోజు, రేపు, ఆదివారం కూడా ఈ సినిమా అదిరిపోయే కలెక్షన్లను సొంతం చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.ప్రభాస్ తర్వాత ప్రాజెక్ట్ లు కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా స్పిరిట్ సినిమా షూటింగ్ త్వరలో మొదలుకానుందని సమాచారం అందుతోంది.సందీప్ రెడ్డి వంగా( Sandeep Reddy Vanga ) ప్రభాస్ కోసం అద్భుతమైన స్క్రిప్ట్ ను సిద్ధం చేశారని తెలుస్తోంది.
ఈ సినిమాలో యానిమల్ సినిమాను మించిన హిట్ అందుకుంటానని సందీప్ రెడ్డి వంగా కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.సందీప్ రెడ్డి వంగా కల్కికి మించిన హిట్ ప్రభాస్ కు ఇవ్వాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.ప్రభాస్ కు తర్వాత సినిమాలతో భారీ హిట్స్ దక్కుతాయేమో చూడాల్సి ఉంది.
స్టార్ హీరో ప్రభాస్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది.