సినిమా కోసం రెండేళ్లు తిరిగా.. భార్య జీతంతో బ్రతికా.. దిబాకర్ బెనర్జీ కామెంట్స్ వైరల్!

సినిమా ఇండస్ట్రీ( Film Industry )లో ఉన్న వాళ్ళకి కోట్లకు కోట్లు ఆస్తులు ఉంటాయని వారు లగ్జరీ లైఫ్ ని గడుపుతుంటారని, ఎటువంటి కష్టాలు లేకుండానే సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చి ఉంటారని చాలామంది భావిస్తూ ఉంటారు.కానీ మీరు అలా అనుకుంటే పప్పులో కాలు వేసినట్టే.

 Director Dibakar Banerjee Personal Life Struggles , Dibakar Banerjee, Financiall-TeluguStop.com

ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం సెలబ్రేటిలుగా కొనసాగుతున్న చాలామంది ఒకానొక సమయంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొనడంతో పాటు ఫైనాన్షియల్ గా సమస్యలు ఎదుర్కొని ఆస్తులు కూడా అమ్ముకున్నారు.అలా సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది సెలబ్రిటీలు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

అటువంటి వారిలో దర్శకుడు దివాకర్ బెనర్జీ( Director Dibakar Banerjee ) కూడా ఒకరు.

Telugu Dibakarbanerjee, Khosla-Movie

తాజాగా దివాకర్ దర్శకత్వం వహించిన లవ్‌ సెక్స్‌ ఔర్‌ ధోకా’ సీక్వెల్‌ రిలీజ్‌కు రెడీ అవుతోంది.సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కెరీర్‌ తొలినాళ్లలోని కష్టాలను పంచుకున్నాడు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.

నేను తీసిన తొలి సినిమా ఖోస్లా కా ఘోస్లా( Khosla Ka Ghosla ).అప్పటికి నేనింకా ఢిల్లీలోనే ఉన్నాను.

అయితే ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లాలంటే ముంబైకి రావాలని అర్థమైంది.కొద్దిరోజులు ముంబైలో తిరిగాను పర్సు ఖాళీ అయింది.

సినిమా కొనేందుకు ఏ డిస్ట్రిబ్యూటరూ ముందుకు రాలేదు.అప్పుడు నా భార్యను పిలిచి ఏదైనా ఉద్యోగం చూసుకోమన్నాను.

మూడు వారాలకే తను ఒక ఉద్యోగం వెతుక్కుని సంపాదించడం మొదలుపెట్టింది.

Telugu Dibakarbanerjee, Khosla-Movie

అలా ముంబైలో బతకడం మొదలుపెట్టాం.అలా రెండేళ్లపాటు తన జీతంతోనే బతికాం.ఆ సమయంలో నేను చిన్నపాటి యాడ్స్‌కు పని చేశాను.

నా సినిమా చూశాక ఎవరూ కొనడానికి ఆసక్తి చూపించలేదు, కానీ నాతో మరో సినిమా తీస్తామని ముందుకు వచ్చారు.ఎన్నో తంటాలు పడ్డ తర్వాత ఆ చిత్రం రిలీజైంది అని చెప్పుకొచ్చాడు.

కాగా ఖోస్లా కా ఘోస్లా సినిమాను 2006లో యూటీవీ మోషన్‌ పిక్చర్స్‌( UTV Motion Pictures ) రిలీజ్‌ చేసింది.ఈ చిత్రంలో అనుపమ్‌ ఖేర్‌, ప్రవీణ్‌ దబాస్‌, తారా శర్మ, రణ్‌వీర్‌ షోరే తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube