ఈ మధ్య సోషల్ మీడియా ఎక్కువగా ఉపయోగంలోకి వచ్చిన తర్వాత చాలామంది వెరైటీ వంటకాలను ప్రజలకు పరిచయం చేస్తున్నారు.ఈ మధ్యకాలంలో చాలామంది వారి ఆరోగ్యం కోసం అనేక కొత్త పదార్థాలను వారి ఆహార విషయంలో జత చేసుకుంటున్నారు.
డైటింగ్ అంటూ చాలామంది వారి బరువును తగ్గించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.ఇలా డైట్ కంట్రోల్ చేసుకోవడానికి చాలామంది రెండు పుట్లా చపాతీలను తింటూ జీవనం కొనసాగిస్తున్నారు.
ఇకపోతే చపాతీలు( Chapatis ) తినేవారికి చాలా సులువుగానే ఉంటుంది కానీ.చపాతీలు చేయడానికి మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది.
ముందుగా చపాతి పిండి సరైన మిశ్రమలలో అన్ని కలుపుకొని ఆ తర్వాత ఒకదాని తర్వాత ఒకటి రుద్దుకుంటూ పెన్నం పై అటు ఇటు కాలుస్తూ చివరికి వేడివేడిగా తినడానికి రెడీ అవుతాయి.మళ్లీ చపాతీలోకి ఏదో ఒక కూర అంటూ మరి దానికి కూడా టైం కేటాయించాల్సి ఉంటుంది.ఇలాంటి సమయంలో ఓ మహిళ చపాతీలను కాల్చడానికి కొత్త టెక్నిక్ తీసుకోవచ్చింది.పొయ్యి మీద అసలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఓ మహిళ ఓ కొత్త పద్ధతి ఫాలో చేపట్టింది.
ఎలాంటి అలసట లేకుండా చపాతీలను చాలా సులువుగా తయారు చేసే ఈ టెక్నిక్ ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.ఇక ఇందుకు సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక ఈ వైరల్ వీడియోలో ఓ మహిళ చపాతీలు రెడీ చేయడానికి ముందుగా ప్రెజర్ కుక్కర్ని ( Pressure cooker )వాడింది.ముందుగా చపాతీలను రెడీ చేయడానికి పిండిని కలిపి పెట్టుకుని ఉండగా.దానిని ఐదు నుంచి ఆరు రొట్టెలను తయారు చేసింది.వాటిని కాస్త పూరీల కంటే కొద్ది పెద్ద సైజులో ఉండే విధంగా కట్ చేసుకుని ప్రెషర్ కుక్కర్ తీసుకుని.
దానిని స్టవ్ పై పెట్టి ఆ తర్వాత ఓ చిన్న గిన్నెలో ఉప్పు తీసుకుని అందులో వేసింది.ఆ తర్వాత ఆ ఉప్పుపై మరో గిన్నెను ఉంచి మొదటి రోటీని పెట్టింది.
అలా ఒకదాని తర్వాత పెట్టింది.ఆ తర్వాత ప్రెజర్ కుక్కర్ మూత పెట్టి కొన్ని నిమిషాల తర్వాత కుక్కర్ మూత తీసి చూసింది.
అంతే కేవలం ఆవరి తోనే ఆ చపాతీలు తయారైపోయాయి.అలా చేసిన తర్వాత బయటకు తీసిన చపాతీల మీద నెయ్యి వేసి సర్వ్ చేసుకుంది.