మలయాళం ఇండస్ట్రీ రేంజ్ పెంచిన సినిమాలివే.. ఈ సినిమాల కలెక్షన్లు తెలిస్తే షాకవ్వాల్సిందే!

ఇటీవల కాలంలో మలయాళ సినిమాలు( Malayalam movies ) విడుదల అయ్యి మంచి సక్సెస్ సాధిస్తున్న విషయం తెలిసిందే.గత కొన్ని ఏళ్లుగా కంటెంట్ బెస్ట్ మూవీస్ ని ఎక్కువగా ఇస్తోంది మలయాళం ఇండస్ట్రీ.

 Malyalam Movies Touches 500 Cr With Four Movies, Malayalam Movie, Four Movies, B-TeluguStop.com

నాలుగు సినిమాలతో అయిదు వందల కోట్లకు పైగా గ్రాస్ ని దాటించేసి అబ్బురపరుస్తోంది.వీటిలో ఏదీ విజువల్ గ్రాండియర్ కాదు.

భారీ గ్రాఫిక్స్ వాడింది, దేశవిదేశాలు చుట్టినవి లేదు.అయినా కూడా ఈ ఫీట్ సాధించడం మాములు విషయం కాదనే చెప్పాలి.

ముందు నుంచి వెనుక వరస తీసుకుంటే మంజుమ్మల్ బాయ్స్( Manjummal Boys ) ఇప్పటికే 230 కోట్లు దాటేసి టాప్ వన్ వైపు పరుగులు పెడుతోంది.తెలుగు వెర్షన్ ఫైనల్ రన్ కలిపితే మేజిక్ ఫిగర్ సాధ్యమేనని చెప్పవచ్చు.

Telugu Bramayugam, Budget, Malayalam, Malyalamtouches, Manjummal, Premalu, Goat-

ఈ సినిమా కంటే ముందు విడుదలైన సినిమా ప్రేమలు( Premalu ).చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా 150 కోట్లకు పైగా కలెక్షన్స్ లో సాధించింది.తెలుగులో విపరీతమైన పోటీ మధ్య వచ్చినా పద్దెనిమిది కోట్లు దాటడం మాటలు కాదనే చెప్పాలి.ఇవి రెండు భాషల్లోనూ విజయవంతమైన చిత్రాలు.పృథ్విరాజ్ సుకుమారన్ ది గోట్ లైఫ్ ( The Goat Life ) ఆడు జీవితం కూడా విజయవంతంగా 100 కోట్ల క్లబ్బులో అడుగుపెట్టేసింది.ఇతర భాషల్లో స్లో నెరేషన్ వల్ల ఆడలేదు కానీ కేరళ వాసులు మాత్రం బ్రహ్మరథం పట్టారు.

మమ్ముట్టి భ్రమయుగం సినిమా ( Bramayugam )సైతం ఇదే సీన్.టాలీవుడ్ లో ఫ్లాప్ అయినా వరల్డ్ వైడ్ కలెక్షన్ 60 కోట్లు దాటేసింది.

ఇవన్నీ కలుపుకుంటే అర సహస్రం దాటేసింది.

Telugu Bramayugam, Budget, Malayalam, Malyalamtouches, Manjummal, Premalu, Goat-

ఈ సంవత్సరం ఏ భాషలోనూ కేవలం మూడు నెలల కాలంలో ఇన్ని బ్లాక్ బస్టర్లు లేవు.కౌంట్ పరంగా మన దగ్గర ఉన్నాయి కానీ బడ్జెట్ కోణంలో చూసుకుంటే ఎక్కువ ఖర్చు కాబట్టి పెట్టుబడి రాబడి లెక్కల్లో రెండో స్థానమని చెప్పవచ్చు.అలా కాకుండా కేవలం ఒక్క సినిమా పరిగణనలోకి తీసుకుంటే హనుమాన్ ఎవరికీ అందనంత దూరంలో నిలబడింది.

టిల్లు స్క్వేర్ ఎంత దూకుడుగా ఉన్నా మహా అయితే నూటా ముప్పై నుంచి నూటా యాభై కోట్ల మధ్యలో ఆగిపోతుంది.దెబ్బకు మళయాలంలో క్రేజ్ ఉన్న కాంబోలు నిర్మాణంలో ఉన్నప్పుడే మన నిర్మాతలు డబ్బింగ్ ప్లస్ రీమేక్ హక్కుల కోసం కన్నేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube