గాగుల్స్ పెట్టుకుని స్టైలిష్ లుక్ లో సిరి...  కంటి ఆపరేషన్ చేయించుకున్నావా అంటూ కామెంట్స్!

సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది సెలెబ్రిటీ హోదా అందుకొని సెలెబ్రిటీలుగా సక్సెస్ అయ్యారు.ఇలా ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి ఎన్నో రకాల వీడియోలను చేస్తూ యూట్యూబర్ గా గుర్తింపు పొందినటువంటి వారిలో సిరి హనుమంత్ ( Siri Hanumanth ) ఒకరు.

 Siri Hanumanth Gets Trolled For Her Latest Photo Shoot, Siri Hanumanth, Netizens-TeluguStop.com

ఇలా యూట్యూబ్ ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి ఈమె ఎన్నో వెబ్ సిరీస్ లతో పాటు బుల్లితెర సీరియల్స్ లో కూడా నటించే అవకాశాలను అందుకున్నారు.ఇక ఈమెకు భారీ స్థాయిలో పాపులారిటీ రావడంతో ఏకంగా బిగ్ బాస్ (Bigg Boss) అవకాశాన్ని అందుకున్నారు.

ఇలాంటి బిగ్ బాస్ కార్యక్రమము ద్వారా ఈమె పూర్తిస్థాయిలో నెగిటివిటీని సొంతం చేసుకున్నారు.

ఈ హౌస్ లో మరొక కంటెస్టెంట్ షణ్ముఖ్ తో కలిసి ఈమె చాలా క్లోజ్ గా మూవ్ అవ్వడంతో వీరి గురించి భారీ స్థాయిలో నెగిటివిటీ స్ప్రెడ్ అయింది.ఇకపోతే బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఈమె కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు.ప్రస్తుతం జబర్దస్త్ ( Jabardasth ) కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తున్నటువంటి సిరి అనసూయ లేని లోటును పూర్తిగా తీరుస్తున్నారని చెప్పాలి.

అనసూయ ఈ కార్యక్రమం నుంచి తప్పుకోవడంతో సౌమ్యరావు యాంకర్ గా వచ్చారు కానీ ఆమె తర్వాత సిరి యాంకర్ గా ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నారు.

ఈ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తున్నటువంటి తరుణంలో ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకున్నారు అయితే తాజాగా సిరికి సంబంధించిన కొన్ని గ్లామరస్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.వైట్ కలర్ డ్రెస్సులో కిరాక్ ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఈమె ఫోటోషూట్ నిర్వహించారు.

ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం సో ఇది కాస్త వైరల్ గా మారాయి.ఇక ఈ ఫోటోలలో వైట్ డ్రెస్ లో మెరిసిన సిరి.గాగుల్స్ పెట్టుకుని క్రేజీగా ఫోజులు ఇచ్చింది.

ఈ ఫోటోలు చూసిన కొంతమంది నెటిజన్లు సిరి గాగుల్స్ పెట్టుకుని స్టైలిష్ గా ఉందని కామెంట్లు చేయగా మరికొందరు మాత్రం ఏంటి సిరి కంటి ఆపరేషన్ ఏమైనా చేయించుకున్నావా అంటూ మరికొందరు ఈ ఫోటోలపై కామెంట్ లు చేస్తున్నారు.మొత్తానికి ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube