18 ఏళ్ల వయస్సులో అలా చెప్పా.. ఇప్పుడు ముద్దు సీన్లు చేస్తే తప్పేంటి.. అనుపమ కామెంట్స్ వైరల్!

తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ అనుపమ( Heroine Anupama ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది అనుపమ.

 Anupama Parameswaran Opens About Tillu Square Controversy, Anupama Parameswaran,-TeluguStop.com

ప్రేమమ్‌ చిత్రంతో ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా పరిచయం అయిన ఈమె తమిళంలోనూ కొడి, తల్లిపోగాదే, సైరన్‌ వింటి చిత్రాల్లో నటించారు.తెలుగులో కూడా పలు సినిమాలలో నటించి మెప్పించింది.

కాగా ఇటీవల టిల్లు స్క్వేర్‌( Tillu Square ) అనే తెలుగు చిత్రంలో లిప్‌లాక్‌, అందాలారబోత అంటూ రెచ్చిపోయింది అనుపమ.

Telugu Controversy, Tillu Square-Movie

నటి అనుపమ పరమేశ్వరన్‌ నేనా ఇలా నటించింది? అంటూ ఆశ్చరపోతున్నారు.మొత్తానికి టిల్లు స్క్వేర్ సినిమాతో మరింత పాపులరీటిని సంపాదించుకుంది.గుడ్డిలో మెల్ల అన్న సామెత మాదిరి ఈమె నటించిన టిల్లు స్క్వేర్‌ చిత్రం హిట్‌ అయ్యింది.

అందాలారబోత అనే విషయాన్ని పక్కన పెడితే అనుపమ పరమేశ్వరన్‌కు( Anupama Parameswaran ) ఈ చిత్రం మంచి పేరు తెచ్చి పెట్టింది.గ్లామర్‌గా నటించడంపై వస్తున్న విమర్శనలపై అనుపమ ఘాటుగానే స్పందించారు.

ఈ మేరకు అనుపమ మాట్లాడుతూ.నేను లిప్‌లాక్‌ సన్నివేశంలో నటించడాన్ని ఏదో పెద్ద తప్పు చేసినట్లు విమర్శిస్తున్నారు.

నేను ముద్దు సన్నివేశాల్లో నటించను.

Telugu Controversy, Tillu Square-Movie

గ్లామరస్‌ గా నటించను అని 18 ఏళ్ల వయసులో అన్నాను.కానీ నేను నటిగా చాలా పరిణితి చెందాను.కథకు అవసరం అయితే లిప్‌లాక్‌ వంటి సన్నివేశాల్లో నటించడం తప్పేకాదు అని అన్నారు అనుపమ.

అంతే కాకుండా ఒకేరకమైన మూస పాత్రల్లో నటించి బోర్‌ కొడుతోంది అని తెలిపింది.మరో విషయం ఏమిటంటే టిల్లు స్క్వేర్‌ చిత్రం చూసిన తరువాత ప్రశంసించడమో, విమర్శించడమో చేయవచ్చు గానీ, చిత్రం చూడకుండానే విమర్శించడం కరెక్ట్‌ కాదని నటి ఫైర్‌ అయ్యారు అనుపమ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube