Pawan Kalyan : పవన్ ఎమ్మెల్యేగా గెలిచినా పిఠాపురంలో అందుబాటులో ఉండరు.. వైసీపీ ప్రచారం ఆ పార్టీకి ప్లస్ అవుతుందా?

ఏపీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం( Pithapuram Constituency ) ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతోంది.పవన్, వంగా గీత( Pawan, Vanga Geeta ) మధ్య గట్టి పోటీ నెలకొనడంతో ఈ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారనే చర్చ జరుగుతోంది.

 Ycp Publicity Against Pawan Kalyan Details Here Goes Viral In Social Media-TeluguStop.com

ఒకవైపు పవన్ కళ్యాణ్ మరోవైపు వంగా గీత గెలుపు విషయంలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.పిఠాపురం నియోజకవర్గం కోసం రాజకీయ పార్టీలు భారీ స్థాయిలో ఖర్చు చేయడానికి సిద్ధమయ్యాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

అయితే వైసీపీ( YCP ) ప్రధానంగా పవన్ ఎమ్మెల్యేగా గెలిచినా పిఠాపురంలో అందుబాటులో ఉండరని సినిమాలతో ఆయన బిజీ అవుతారని వంగా గీత స్థానికంగా అందుబాటులో ఉంటారని ప్రచారం చేస్తున్నట్టు తెలుస్తోంది.అయితే ఈ ప్రచారం వైసీపీకి మేలు చేస్తుందా? లేదా? అనే ప్రశ్నకు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.జగన్ కానీ చంద్రబాబు కానీ బాలయ్య కానీ సొంత నియోజకవర్గాల్లో అందుబాటులో ఉండి పాలన సాగించట్లేదు.

తమ పీఏల ద్వారా ఈ నేతలు పాలన సాగిస్తున్నారు.అయితే వంగా గీత స్థానికంగా అందుబాటులో ఉండటం ఆమెకు కొంతమేర కలిసొస్తుందని చెప్పవచ్చు.వైసీపీ నేతలు మాత్రం ఇతర నియోజకవర్గాలతో పోల్చి చూస్తే ఈ నియోజకవర్గంలో గెలుపు కోసం మరింత ఎక్కువగా కష్టపడుతున్నారని సమాచారం అందుతోంది.

మరోవైపు వైసీపీ ఈ నెల 27వ తేదీలోగా మేనిఫెస్టో ప్రకటించనుందని తెలుస్తోంది.

ఈ నెల 27వ తేదీన బస్సు యాత్ర( bus trip ) మొదలుకానుండగా బస్సు యాత్ర మొదలయ్యే సమయానికి మేనిఫెస్టో రిలీజ్ చేయాలని వైసీపీ భావిస్తోంది.సరికొత్త హామీలతో వైసీపీ ముందుకు రానుందని సమాచారం అందుతోంది.టీడీపీ సూపర్ సిక్స్ హామీలు బాగానే ఉన్నా వాటిని ప్రచారం చేసుకోవడంలో టీడీపీ ఫెయిల్ అవుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఏపీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయ పార్టీల నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేయడంపై ప్రధానంగా దృష్టి పెట్టారు.ఏపీ ఎన్నికల్లో అధికారం ఏ పార్టీ సొంతమవుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube