Pawan Kalyan : పవన్ ఎమ్మెల్యేగా గెలిచినా పిఠాపురంలో అందుబాటులో ఉండరు.. వైసీపీ ప్రచారం ఆ పార్టీకి ప్లస్ అవుతుందా?

ఏపీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం( Pithapuram Constituency ) ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతోంది.

పవన్, వంగా గీత( Pawan, Vanga Geeta ) మధ్య గట్టి పోటీ నెలకొనడంతో ఈ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారనే చర్చ జరుగుతోంది.

ఒకవైపు పవన్ కళ్యాణ్ మరోవైపు వంగా గీత గెలుపు విషయంలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.

పిఠాపురం నియోజకవర్గం కోసం రాజకీయ పార్టీలు భారీ స్థాయిలో ఖర్చు చేయడానికి సిద్ధమయ్యాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

అయితే వైసీపీ( YCP ) ప్రధానంగా పవన్ ఎమ్మెల్యేగా గెలిచినా పిఠాపురంలో అందుబాటులో ఉండరని సినిమాలతో ఆయన బిజీ అవుతారని వంగా గీత స్థానికంగా అందుబాటులో ఉంటారని ప్రచారం చేస్తున్నట్టు తెలుస్తోంది.

అయితే ఈ ప్రచారం వైసీపీకి మేలు చేస్తుందా? లేదా? అనే ప్రశ్నకు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

జగన్ కానీ చంద్రబాబు కానీ బాలయ్య కానీ సొంత నియోజకవర్గాల్లో అందుబాటులో ఉండి పాలన సాగించట్లేదు.

"""/" / తమ పీఏల ద్వారా ఈ నేతలు పాలన సాగిస్తున్నారు.అయితే వంగా గీత స్థానికంగా అందుబాటులో ఉండటం ఆమెకు కొంతమేర కలిసొస్తుందని చెప్పవచ్చు.

వైసీపీ నేతలు మాత్రం ఇతర నియోజకవర్గాలతో పోల్చి చూస్తే ఈ నియోజకవర్గంలో గెలుపు కోసం మరింత ఎక్కువగా కష్టపడుతున్నారని సమాచారం అందుతోంది.

మరోవైపు వైసీపీ ఈ నెల 27వ తేదీలోగా మేనిఫెస్టో ప్రకటించనుందని తెలుస్తోంది. """/" / ఈ నెల 27వ తేదీన బస్సు యాత్ర( Bus Trip ) మొదలుకానుండగా బస్సు యాత్ర మొదలయ్యే సమయానికి మేనిఫెస్టో రిలీజ్ చేయాలని వైసీపీ భావిస్తోంది.

సరికొత్త హామీలతో వైసీపీ ముందుకు రానుందని సమాచారం అందుతోంది.టీడీపీ సూపర్ సిక్స్ హామీలు బాగానే ఉన్నా వాటిని ప్రచారం చేసుకోవడంలో టీడీపీ ఫెయిల్ అవుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఏపీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయ పార్టీల నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేయడంపై ప్రధానంగా దృష్టి పెట్టారు.

ఏపీ ఎన్నికల్లో అధికారం ఏ పార్టీ సొంతమవుతుందో చూడాలి.

స్టార్ హీరో అల్లు అర్జున్ కు తత్వం బోధపడిందా.. ఇకనైనా ఆ ఒక్క విషయంలో మారతారా?