Groundnut Crop : వేరుశనగ పంటను వేరు కుళ్ళు తెగుళ్ల బెడద నుంచి సంరక్షించే పద్ధతులు..!

వేరుశనగ ప్రధాన నూనె గింజ పంటలలో ఒకటి.వేరుశనగ పంటలో( Groundnut Crop ) ఆశించిన స్థాయిలో దిగుబడులు సాధించాలంటే విత్తన ఎంపిక అత్యంత కీలకం.

 Methods Of Protecting The Groundnut Crop From The Pestilence Of Rootworms-TeluguStop.com

మొలకెత్తి శక్తిని 85% కలిగి ఉన్న విత్తనాలను మాత్రమే సాగుకు ఎంపిక చేసుకోవాలి.ఒక కిలో విత్తనాలను మూడు గ్రాముల మాంకోజెబ్ లేదా ఒక గ్రాము కార్బండిజంతో విత్తన శుద్ధి చేయాలి.

ఆ తరువాత విత్తనాలను కాసేపు నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి.

పొలంలో విత్తనాల మధ్య పది సెంటీమీటర్ల దూరం, విత్తనాల వరుసల మధ్య 25 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు నాగలితో విత్తుకోవాలి.

ఒక ఎకరాకు నాలుగు టన్నుల పశువుల ఎరువు, 25 కిలోల యూరియా,( Urea ) 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్, 30 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ను ఆఖరి దుక్కిలో వేసుకోవాలి.

పంట కాలంలో వాతావరణ పరిస్థితులను బట్టి 8 లేదా 9 నీటి తడులు అవసరం.ఊడ దిగేదశ నుండి గింజ గట్టి పడే వరకు నీటి ఎద్దడి సమస్యలు లేకుండా చూసుకోవాలి.వేరుశనగ పంటలో కలుపు( Weed ) సమస్య అధికంగా ఉంటే తీవ్ర నష్టం ఎదుర్కోవాల్సిందే.విత్తిన మూడు రోజులలో ఒక ఎకరం పొలానికి 0.8 లీటర్ల అల్లాక్లోర్ లేదా 1.3 లీటర్ల పెండిమిథాలిన్ ను 200 లీ.నీటిలో కలిపి నేల పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేయాలి.

విత్తిన 45 రోజుల వరకు పొలంలో కలుపు లేకుండా సమర్థవంతంగా అదుపు చేయాలి.ఒకవేళ అలా చేయలేకపోతే దాదాపుగా 45% పంట దిగుబడి తగ్గే అవకాశం ఉంది.వేరుశనగ పంటకు తీరనష్టం కలిగించే తెగుళ్ల విషయానికి వస్తే.వేరు కుళ్లు తెగుళ్లు కీలకపాత్ర పోషిస్తాయి.ఐదు గ్రాముల బ్రాసికాల్ ద్రావణమును చదరపు కిలోమీటర్ కి ఒక లీడర్ చొప్పున నేలను తడపాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube