Macherla Chennakesava Swamy Temple : మీ సమస్యలు తీరాలంటే.. మాచర్ల చెన్నకేశవుడిని దర్శించుకోవాల్సిందే..!

ఆంధ్రప్రదేశ్ లోని ప్రఖ్యాత దేవాలయాల్లో మాచర్ల చెన్నకేశవ ఆలయం( Macherla Chennakesava Swamy Temple ) ప్రధానమైనది.దీనికి ఎన్నో చారిత్రక ఘట్టాలు నిలిచి ఉన్నాయి.

 History And Significance Of Sri Macherla Chennakesava Swamy Temple-TeluguStop.com

అద్భుతమైన నిర్మాణశైలి, అబ్బురపరిచే శిల్ప సంపదతో అలరారుతున్న ఈ ప్రాచీన ఆలయ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.గుంటూరు జిల్లాలోని( Guntur District ) మాచర్ల పట్టణంలో ఈ ఆలయం ఉంది.

మాచర్లకు మహాదేవి చర్ల, విష్ణుపురము అనే పేర్లు కూడా ఉన్నాయి.బ్రహ్మనాయుడు తన స్వస్థలమైన మాచర్లాపురం పేరుతో ఈ పట్టణాన్ని నిర్మించారని చెబుతారు.

చంద్రవంక నదీ తీరాన గల ఈ ఆలయంలో శ్రీ మహావిష్ణువు( Sri Mahavishnu ) చెన్నకేశవుడిగా పూజలు అందుకుంటాడు.చెన్ను అనగా అందమైన అని అర్థం.

Telugu Guntur, Macherla Temple, Sri Mahavishnu-Latest News - Telugu

దీనికి తగినట్లే ఇక్కడ స్వామి అద్భుతమైన సౌందర్యంతో దర్శనమిస్తారు.కేశవాణి పదానికి ఒత్తైనా, మెత్తని కేశములు కలిగిన వాడు అని అర్థం.కేశవ అనగా బ్రహ్మ, విష్ణువు, శివుని రూపాలు కలిసిన పరమాత్మగా పిలుస్తారు.ఇక్కడి మూర్తిని సాక్షాత్తు కార్త వీర్యార్జునుడు ప్రతిష్టించడానికి కూడా చెబుతారు.అయితే ఈ ఆలయంలో స్వామి వారు నాలుగు చేతుల్లో పద్మం, శంఖం, చక్రం, గదను తరిమించి లక్ష్మీ సమేతంగా దర్శనమిస్తారు.అయితే స్వామివారి దర్శనం తీసుకోవడం వలన భక్తులు ఎలాంటి సమస్యలను అయినా దూరం చేసుకోవచ్చు.

ఎందుకంటే ఇక్కడి చంద్రవంక నది( Chandravanka River ) తూర్పు నుంచి పడమరకు ప్రవహిస్తూ దర్శనమిస్తుంది.

Telugu Guntur, Macherla Temple, Sri Mahavishnu-Latest News - Telugu

కాబట్టి భక్తులు స్వామి దర్శనం తర్వాత ఇక్కడికి వచ్చి కప్పక స్తంభానికి ముఖ్య ప్రదక్షిణం చేయాలి.అలా చేయడం వలన మీకున్న సమస్యలన్నీ తొలగిపోయి మీ జీవితాన్ని ఆనందంగా గడుపుతారు.ముఖ్యంగా చెప్పాలంటే బ్రహ్మోత్సవాలు , రథోత్సవం రోజున జరిగే జాతరకు లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు.

అలాగే ఏటా చైత్ర శుద్ధ పూర్ణమి రోజున స్వామివారికి ఘనంగా ప్రజలందరి మధ్య కళ్యాణం కూడా జరుపుతారు.ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూడడానికి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube