వీడియో: ఒడ్డుకు కొట్టుకొచ్చిన తిమింగలాన్ని బతికించేందుకు రోజంతా బకెట్లతో నీళ్లు పోశారు..!

ప్రతియేటా వేల కొద్ది తిమింగలాలు, డాల్ఫిన్లు, ఇతర సముద్ర జంతువులు ఒడ్డుకు కొట్టుకు వస్తుంటాయి.అయితే తిమింగలాలు ఒక్కసారి ఒడ్డుకు కొట్టుకు వస్తే అవి మళ్లీ వాటంతట అవే లోపలికి వెళ్లలేవు.

 Video They Poured Buckets Of Water All Day To Save The Washed Up Whale, Viral L-TeluguStop.com

ఇలా ఒడ్డుకు వచ్చే ఈ భారీ సముద్ర క్షీరదాల్లో ఆరోగ్యకరమైనవి ఉంటాయి.అలానే గాయపడిన లేదా చనిపోయినవి ఉంటాయి.

సాధారణంగా ఆరోగ్యకరమైన తిమింగలాలు భారీ అలల ధాటికి ఒడ్డు మీదకు కొట్టుకొని వస్తాయి.

అయితే తాజాగా ఒక భారీ తిమింగలం కూడా దురదృష్టవశాత్తు ఒక అల వల్ల ఒడ్డుకు వచ్చింది.

ఇది బతికే ఉండటంతో స్థానికులు అందరూ అయ్యో పాపం అనుకున్నారు.దాన్ని ఎలాగైనా కాపాడాలని కొందరు ముందుకొచ్చారు.అది చాలా పెద్దగా ఉండటంతో దానిని సముద్రం లోకి తీసుకు పోవడం వారి వల్ల కాలేదు.దీంతో చేసేది లేక ప్రతి ఒక్కరూ బకెట్లు చేతపట్టి దానిపై నీళ్లు పోయడం ప్రారంభించారు.

అలా 19 గంటల పాటు రెస్ట్ తీసుకోకుండా తిమింగలం పై నీళ్లు పోసి దాన్ని బతికించారు.చివరికి ఒక పెద్ద అలా మళ్లీ రావడంతో ఆ తిమింగలం నీటిలోకి వెళ్ళగలిగింది.

ఆ తర్వాత కూడా స్థానికులందరూ దాన్ని ఫాలో అవుతూ అది మంచిగా వెళ్తుందా లేదా అని నిర్ధారించుకున్నారు.ఆ తిమింగలం శక్తి పుంజుకుని సముద్రం లోపలికి వెళ్లేంత వరకు స్థానికులు ఫాలో అయ్యారు.దీనికి సంబంధించిన వీడియో ని కొందరు తమ కెమెరాల్లో బంధించారు.ఆ వీడియో కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది.ఇది చూసిన నెటిజన్లు వీరిని తెగ పొగుడుతున్నారు.ఒక జీవి ప్రాణాలను బతికించేందుకు దాదాపు ఒక రోజంతా శ్రమపడిన ఈ హీరోలకు సెల్యూట్ అని కామెంట్లు చేస్తున్నారు.

ఈ వీడియో పై మీరు కూడా ఓ లుక్కేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube